కరోనా బాధితులకు అండగా విరాట్‌ కోహ్లీ, అనుష్క శ‌ర్మ ఫండ్ రైజింగ్, రూ.2 కోట్ల విరాళం

Virat Kohli, Anushka Sharma Announces Fund Raising Campaign For COVID-19 Relief,Mango News,Mango News Telugu,Virat Kohli Latest News,Virat KohliNews,Virat Kohli Latest Video,Anushka Sharma,Anushka Sharma Latest News,Anushka Sharma Video,Virat Kohli And Anushka Sharma Video,Virat Kohli And Anushka Sharma About Present Situation,Virat Kohli And Anushka Sharma,Anushka Sharma And Virat Kohli Donate Rs 2 Crore,Virat Kohli Start Fundraiser For Covid-19 Relief,Covid-19 Relief,Covid-19,Anushka Sharma And Virat Kohli Start Fundraiser For Covid-19 Relief,Anushka SharmaAnd Virat Kohli Share Video Message,Anushka Sharma And Virat Kohli donate Rs 2 cr,Anushka Sharma And Virat Kohli Start Fund Raising Campaign,Virat Kohli donation,Virat Kohi And Anushka Sharma Start Fundraiser

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో బాధితులకు అండ‌గా నిల‌బ‌డేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, అనుష్క శ‌ర్మ దంప‌తులు ఫండ్ రైజింగ్ కోసం క్యాంపెయిన్ మొద‌లుపెట్టారు. క‌రోనా బాధితుల స‌హాయార్థం రూ.2 కోట్లు విరాళం ఇస్తున్న‌ట్టు ప్రకటించారు. విరాట్ కోహ్లి, అనుష్క‌ శర్మ లు శుక్రవారం నాడు ట్విట్ట‌ర్ ద్వారా ఓ వీడియో షేర్ చేస్తూ కరోనాపై పోరాడుతున్న వారికి అండగా ఉండేందుకు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

“దేశంలో ప్రస్తుతం ప‌రిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. క‌రోనాపై దేశం పోరాటం చేస్తుండ‌గా, ఈ ప‌రిస్థితుల‌లో ప్ర‌జ‌ల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలుగుతుంది. పగలు రాత్రి మన కోసం పోరాడుతున్న వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కృతజ్ఞతలు. వారి అంకితభావం ప్రశంసించదగినది. కానీ ఇప్పుడు వారికి మన మద్దతు అవసరం మరియు మనం వారి పక్షాన నిలబడాలి. కాబట్టి మేమిద్దరం కెట్టో(ketto) వెబ్‌సైట్‌ ద్వారా నిధుల సేకరణను ప్రారంభించాము, ఈ నిధులు యాక్ట్ గ్రాంట్లకు వెళతాయి. మీరందరూ కూడా మద్ధతుగా వచ్చి విరాళం ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. ప్రతి సహాయం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న కుటుంబాలు, స్నేహితుల కోసం క‌లిసి క‌ట్టుగా నిలబడాల్సిన సమయం ఇది. మనం కలిసి ఉంటే కరోనాపై యుద్ధంలో విజయం సాధించగలము. సురక్షితంగా ఉండండి” అని విరాట్ కోహ్లి, అనుష్క‌ శర్మ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ