తెలంగాణలో లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌నకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపునకు అధికారులు, సిబ్బంది అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కాపుకాసేందుకు పోలీసులూ ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8 నుంచే ఆ ప్రక్రియ మొదలుకానుంది. అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్స్‌ను తెరవనున్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ బాక్సులను, ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు.
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కోసం 19 హాళ్లు, ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున, చేవెళ్ల పార్లమెంటు స్థానంలోని మహేశ్వరంలో మాత్రం రెండు హాళ్లు, మొత్తం 120 హాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, వీటి లెక్కింపు కోసం 276 కౌంటింగ్ టేబుళ్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 1,855 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈవీఎంలను తీసుకురావడం, లెక్కలు వేసుకోవడం, అధికారులు నిర్ధారించడం వంటి కారణాలతో తొలి రౌండ్ ఫలితానికి దాదాపు గంటరన్నర సమయం పట్టనుంది. ఆ తర్వాత మాత్రం ఒక్కో రౌండుకు 20 నిమిషాల లోపే పూర్తవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా తొలి ఫలితం వెలువడుతుంది. సాయంత్రం 4, 5 గంటలకల్లా మొత్తం తేలిపోతాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల నుంచి 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 25 లోక్‌సభ స్థానాల నుంచి 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8:30కి ఈవీఎమ్స్ కౌంటింగ్ ప్రారంభంకానుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్‌కు 350 హాల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY