టిడిపి పై దాడులు ఆపి,అభివృద్ధి పై దృష్టి పెట్టండి

Chandrababu Naidu Comments On CM YS Jagan,Mango News,TDP Chief Chandrababu Naidu comments on CM YS Jagan government,Chandrababu Naidu satirical comments on AP CM YS Jagan,Chandrababu Naidu Latest News,Chandrababu Naidu comments on YSR Congress Party chief YS Jagan,Nara Chandrababu Naidu Comments On CM YS Jagan Mohan Reddy
Chandrababu Naidu Comments On CM YS Jagan

టిడిపి అధ్యక్షుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించి, వైసీపీ నేతల దాడుల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన చింతా భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని కలిశారు, మరియు బత్తలపల్లి మండలం పత్యపురానికీ చెందిన తెలుగుదేశం కార్యకర్త రాజు కుటుంబాన్ని పరామర్శించారు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రూ. 5 లక్షలు పార్టీ తరుపున ఆర్ధిక సాయం అందించారు. పత్యపురం లో దాడుల్లో గాయపడిన మరో ఐదుగురు కార్యకర్తలకు రూ.50 వేలు చొప్పున అందజేశారు.

ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అధికార పార్టీ దాడులను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నందు వాళ్ళ టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే దాడులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలనే కట్టడి చేయలేక పోతే, రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎలా కాపాడుతారని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని ప్రశ్నించారు. అధికార పార్టీ దాడుల్లో గాయపడి, పోలీసులను ఆశ్రయిస్తే, వాళ్ళు తిరిగి తెదేపా కార్యకర్తలపైనే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని, ఇలాంటి దారుణాలని అపి ప్రజలందరిని సమాన దృష్టితో చూసి న్యాయం చేయాలనీ చెప్పారు.

తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉండగా శాంతి భద్రలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని, వైకాపా నేతలపై ఎటువంటి దాడులు చేయలేదని తెలిపారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట జెసి దివాకర్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, మరియు జెసి పవన్, పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =