
పెళ్లంటే పందిళ్లు..సందడులు ..చప్పట్లు..భాజాలు, భజంత్రీలు మాత్రమే అన్నట్లుగా ఉండే పెళ్లి వేడుక..క్రమంగా వెడ్డింగ్ మార్కెట్ డెస్టినేషన్ ను చేంజ్ చేసే స్థాయికి వెళ్లిపోతుంది. ఒకప్పుడు మూడు రోజులు, ఐదు రోజుల వేడుకను చేస్తేనే అబ్బో..ఏం చేశారురా పెళ్లంటే అలా చేయాలి అన్న స్టేజ్ నుంచి కొన్ని నెలలుగా ఆ ఇంటి పెళ్లి వేడుక గురించి ప్రపంచం మాట్లాడుకునే స్టేజికి వెళ్లిపోయింది. అవును ఎప్పుడయితే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వార్త తెర మీదకు వచ్చిందో అప్పుడే ప్రపంచ వ్యాప్తంగా పెళ్లి సందడి మొదలయింది.
అవును..అంబానీల ఇంట దాదాపు రూ.2,000 కోట్ల ఖర్చుపెట్టడంతో అతి ఖరీదైన పెళ్లిగా నభూతో నభవిష్యతి అన్న రేంజ్ లో పెళ్లి తంతు నడుస్తోంది. అంతేకాదు ఈ పెళ్లి వల్ల రూ.10 లక్షల కోట్ల వెడ్డింగ్ మార్కెట్ కూడా పెరుగుతోంది. మాములుగా అయితే పెళ్లికి ఐదు లక్షలో, పది లక్షలో, కోటో, పది కోట్లో ఖర్చు పెడతారు. ఇంకా బాగా స్థితిమంతులు అయితే ఆ ఖర్చు ఇంకాస్త పెరుగుతుంది కానీ అంబానీ ఇంట పెళ్లి వేడుకకు మాత్రం వేలకోట్లు ఖర్చు పెడుతున్నారు.
అందుకే ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా అంబానీ ఇంట పెళ్లి కబుర్లే వినిపిస్తున్నాయి..కనిపిస్తున్నాయి. విందు భోజనంలో 2 వేలకు పైగా దేశ విదేశాల స్పెషల్ వంటకాలు. పదుల కోట్లలో రెమ్యునరేషన్ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ సెలబ్రెటీలతో స్టేజ్ షోలు ఇలా ప్రతీ విషయంలోనూ అంబానీ మార్కును చూపిస్తూ అత్యంత వేడకగా కొడుకు కళ్యాణాన్ని చేస్తున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయడం కోసం.. అంబానీ ఫ్యామిలీ కొన్ని నెలలుగా వేడుకలు నిర్వహిస్తూనే ఉంది. మార్చిలో మొదలుపెట్టిన వేడుకలు.. జూలై వరకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను చేస్తూ వచ్చింది. ఖరీదైన వెడ్డింగ్ కార్డులతో పాటు కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చింది.
అంతేకాకుండా ప్రపంచం నలుమూలల నుంచి పెళ్లికి వచ్చే గెస్టులను.. పెళ్లి మండపానికి తీసుకురావడానికి పదులు సంఖ్యలో విమానాలను కూడా అద్దెకు తీసుకుంది. ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న ఈ పెళ్లి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి దొరుకుతుందన్న టాక్ నడుస్తోంది. మొత్తంగా అంబానీ ఇంట జరుగుతున్న ఈ పెళ్లి వేడుక.. దేశంలోనే వెడ్డింగ్ మార్కెట్ ను పీక్ కు తీసుకువెళ్లిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE