కరోనాతో మరో ఎమ్మెల్యే కన్నుమూత

Congress MLA Died with CoronavirusRemove, MLA Died with Coronavirus, Second Trinamool Congress MLA Died with Coronavirus, Trinamool Congress MLA Died, West Bengal, West Bengal Coronavirus, West Bengal MLA Died, West Bengal News

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కరోనా బారిన పడి పరిస్థితి విషమించి కొందరు ప్రజాప్రతినిధులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడి కన్నుమూశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్(74) కరోనాకు చికిత్స పొందుతూ సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా, ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా సమరేష్ దాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమరేష్ దాస్ మృతి పట్ల పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమరేష్ దాస్ మరణం బెంగాల్ రాజకీయాల్లో తీర్చలేని శూన్యతను మిగిల్చిందని మమతా బెనర్జీ అన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కూడా జూన్ నెలలో కరోనా కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu