గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్

Andhra Pradesh launches digital payment system, AP CM YS Jagan, AP CM YS Jagan Launches Digital Payments, AP News, digital payment system, Digital Payments in AP, Jagan launches UPI facility, Ward Secretariats, YS Jagan Launches Digital Payments in Village

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ఆగస్టు 17, సోమవారం నాడు గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ ను ప్రారంభించారు. దీంతో ఈ రోజు నుంచి సచివాలయాల్లో డిజిటల్‌ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా), కెనరా బ్యాంక్‌ల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న15,004 గ్రామ/వార్డు సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ/ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం అందించే 543 రకాల సేవలకు అవసరాన్ని బట్టి ఇకపై వినియోగదారులు డిజిటల్‌ పేమెంట్‌ చేయవచ్చు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గడపకు ప్రభుత్వ సేవలను అందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ వ్యవస్థలో మరో అడుగు ముందుకేసి డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =