దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్‌ సర్వీసులు, సాంకేతిక సమస్యలతో సేవలకు అంతరాయం

దేశవ్యాప్తంగా వాట్సాప్‌ సర్వీసులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా వాట్సాప్‌ నెట్‌వర్క్‌ మధ్యాహ్నం 12:30 నుంచి ఆగిపోయింది. ఒక్కసారిగా సేవలు ఆగిపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌ డెలివరీ స్టేటస్‌తో పాటు డబుల్‌ టిక్‌, బ్లూటిక్‌ మార్కులు చూపించడం లేదు. అలాగే స్మార్ట్‌ఫోన్స్ లోనే కాకుండా వాట్సాప్ వెబ్, వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లు కూడా ప్రస్తుతం అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే సర్వర్‌ డౌన్‌ కావడంతో వాట్సాప్‌ సేవలకు అంతరాయం కలిగినట్లు సమాచారం. అయితే దీనిపై వాట్సాప్, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ అయిన ‘మెటా’ యాజమాన్యం స్పందించింది. సాంకేతిక సమస్యలతో సేవలకు అంతరాయం వాటిల్లినట్లు ప్రకటించింది. అలాగే సాధ్యమైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి కంపెనీ కృషి చేస్తోందని మెటా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వాట్సాప్ సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా చెప్పకపోవడంతో యూజర్లు అసహనానికి లోనవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY