
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి రోజురోజుకు హీటెక్కుతోంది. అభ్యర్ధుల ప్రచార హోరు పెరిగింది. పవర్లో ఉన్న డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు అమెరికా వ్యాప్తంగా ర్యాలీలకు శ్రీకారం చుడుతూ ఓటర్లకు దగ్గరకు అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా వచ్చే అయిదు నెలలపాటు అమెరికాలో అధ్యక్ష ఎలక్షన్ కోలాహలం నెలకొనబోతోంది. 2019 నాటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జో బైడెన్.. అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా కొత్త బాధ్యతలను స్వీకరించారు. ఈ ఎన్నికలకు కూడా బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నిలబడుతున్నారు. అయితే కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని డెమోక్రాట్లు ఇంకా ఖరారు చేయలేదు .
అటు రిపబ్లికన్ల తరఫున కూడా అభ్యర్థిగా ట్రంప్ నిలబడుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి..మూడోసారి తన లక్ ను పరీక్షించుకోబోతున్నారు.అయితే ఈ ఎన్నికల సమయంలో ట్రంప్ పై ముందుగా పెద్దగా అనుకూల పరిస్థితులు లేకపోయినా.. పెన్సిల్వేనియాలో ఆయనపై హత్యాయత్నం తరువాత పరిస్థితులు ట్రంప్ కు సానుకూలంగా మారినట్లు అమెరికా మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
తాజాగా రిపబ్లికన్ పార్టీ తమ ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించింది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా.. ఓహియో సెనెటర్ జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరును ఖరారు చేసింది. డొనాల్డ్ ట్రంప్ రన్- మేట్‌గా రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది. విస్కాన్సిస్‌లోని మిల్వాకీలో నిర్వహించిన నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ..తమ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరును అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన మహిళ పేరు వినిపించడంతో.. అమెరికాతో పాటు ఇండియా ఆసక్తిగా గమనిస్తోంది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిలబడుతున్న జేడీ వెన్స్ భార్య.. ఉషా చిలుకూరి. ఈమె భారత సంతతికి చెందిన మహిళ. 1986 జనవరి 6న కాలిఫోర్నియా శాన్‌డియాగోలో ఉషా చిలుకూరి జన్మించారు. వృత్తిరీత్యా ఆమె అడ్వకేట్. యేల్ యూనివర్శిటీ బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఎంఫిల్ పూర్తిచేసిన ఉషా చిలుకూరి.. గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్ కింద ఎంఫిల్ చదివారు.
2014లో జేడీ వెన్స్‌ను ఉషా చిలుకూరి ప్రేమించి పెళ్లాడారు. రోమన్ క్యాథలిక్ అయిన జేడీ.. యేల్ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడు ఉషా చిలుకూరికి పరిచయం అయ్యారు. అప్పటివరకు డెమొక్రాట్లకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఉషా చిలుకూరి.. పెళ్లి తరువాత మాత్రం రిపబ్లిక్ పార్టీలో జాయిన్ అయ్యారు. జేడీ వెన్స్, ఉషా చిలుకూరికి ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే పిల్లలు ఉన్నారు.
ఎప్పుడయితే ఉపాధ్యక్షుడిగా డేవిడ్ పేరు వినిపించిందో..అప్పటి నుంచి జేమ్స్ డేవిడ్- ఉషా చిలుకూరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో నివసిస్తోన్న పీవీఆర్ నరసింహారావు అనే ఐఐటీ- చెన్నై పూర్వ విద్యార్థి, వేదిక ఆస్ట్రాలజర్ వీరిద్దరి ఫోటోను తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఉషా చిలుకూరి తండ్రి ఐఐటీ- చెన్నై పూర్వ విద్యార్థి అని ఆయన తెలిపారు. అయితే వీరిద్దరి ఫోటో వైరల్ గా మారడంతో ఎవరీ ఉషా చిలుకూరి అంటూ నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ