డీకేకు ఛాన్స్ దక్కుతుందా?

Karnataka Chief Minister Change,DK Sivakumar,Congress, BJP, Dal,Mallikarjuna Karge, Sonia Gandhi, Rahul Gandhi
Karnataka Chief Minister Change,DK Sivakumar,Congress, BJP, Dal,Mallikarjuna Karge, Sonia Gandhi, Rahul Gandhi

కర్ణాటక సీఎం పదవి వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. రావడమే కాదు ఈ పంచాయితీ ఏకంగా ఢిల్లీకి  చేరింది. ముగ్గురు డిప్యూటీ సీఎంల నియామకానికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమయ్యాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి స్థానాన్ని లింగాయతలకు ఇవ్వాలని కొంతమంది మఠాధిపతులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్‌కు కేటాయించాలని విశ్వ ఒక్కలిగర పీఠాధిపతి చంద్రశేఖరనాథ స్వామి డైరక్టుగా సిద్ధరామయ్యకే సూచించారు. రాష్ట్రంలో ఇంత వరకు ఎప్పుడూ కూడా దళితులకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదని, ఇప్పుడు మాత్రం వారికే పదవి ఇవ్వాలని మరో వాదనను తెరపైకి తీసుకువచ్చారు.

మరోవైపు గ్యారంటీలతో డెవలప్మెంట్ పనులు నిలిచిపోయాయని చెబుతూ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రధాన అస్త్రాలుగా చేసుకుని భారతీయ జనతా పార్టీ, దళ్‌ గవర్నమెంటుపై పోరును కొనసాగిస్తున్నాయి. దీంతో సీఎం మార్పు, డిప్యూటీ సీఎంల సంఖ్య పెంపు విమర్శలు పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఈ గొడవ కాస్తా  కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే వద్దకు వెళ్లగా..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో చర్చించి, వివాదాన్ని పరిష్కరిస్తానని డీకే శివకుమార్‌కు మల్లికార్జున ఖర్గే భరోసా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ