ఉమెన్స్ డేకి ప్రధాని మోదీ స్పెషల్ ఆఫర్..

ప్రధాన మంత్రి మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చారు. ముఖ్యంగా తమ మనసులోని మాటలను ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ నుంచి వివరించే హక్కును కల్పించారు. ఈ విషయాన్ని నేరుగా ప్రధాని మోదీయే ఎక్స్ వేదికగా వివరించారు. ముందుగా భారత దేశంలో ఉన్న మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. మహిళలకు స్పెషల్ ఆఫర్ ఇచ్చారు.

ఉమెన్స్ డే ను పురస్కరించుకుని ప్రధాని మోదీ ..మహిళలు స్వేచ్ఛగా తమ మనసులోని మాటలను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయాన్ని ఆయనే ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తికి నమస్కరిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

తమ ప్రభుత్వం ఎప్పుడూ మహిళల సాధికారత కోసమే కృషి చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. తమ పథకాలు, కార్యక్రమాల్లో అది ప్రతిబింబిస్తుందని వివరించారు. తాను ముందుగా చెప్పినట్లుగానే ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లను విభిన్న రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్న మహిళలు స్వాధీనం చేసుకోవచ్చని.. తమ మనసులోని భావాలను అందులో స్వేచ్ఛగా వెల్లడించవచ్చని పిలుపునిచ్చారు.

ప్రధాని ఇలా ప్రకటించిన కాసేపటికే.. ఇస్రోకు చెందిన శిల్ప, ఎలీనా పోస్టు పెట్టి ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు. దేశానికి ఎన్నో సేవలు అందిస్తున్న తమలాంటి వాళ్లను గుర్తించడం సంతోషంగా ఉందని వారు చెప్పుకొచ్చారు. వీరి తర్వాత వివిధ రంగాల్లో కష్టపడి పని చేస్తూ.. దేశానికి, ప్రజలకు సేవ చేస్తున్న ఎంతోమంది మహిళలు పోస్టులు పెడుతున్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూనే.. తాము చేసిన, చేస్తున్న పనుల గురించి వివరిస్తున్నారు.