ఒమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాపిస్తోంది – ప్రపంచ ఆరోగ్య సంస్థ

Coronavirus, Covid B.1.1.529 variant, COVID-19, covid-19 new variant, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in India, Omicron Variant Is Spreading Fast, Omicron Variant Is Spreading Fast Says World Health Organization, omicron variant south africa, Update on Omicron, World Health Organization, World Health Organization Says The Omicron Variant Is Spreading Fast

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఇప్పటివరకు 77 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు న‌మోదు అయిన‌ట్లు WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియాసిస్ ఈ విష‌యాన్ని తెలిపారు. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. అయితే, ఈ కొత్త వేరియంట్‌ ను అంచ‌నా వేయ‌డంలో విఫ‌లం అయ్యామ‌ని.. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్‌ను అదుపు చేసేందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేక‌పోతున్నార‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒమిక్రాన్ వ‌ల్ల స్వ‌ల్ప తీవ్ర‌త ఉన్న వ్యాధి సోకినా తర్వాత అది ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న అన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదటగా ద‌క్షిణాఫ్రికాలో గుర్తించారు. ఆ దేశాధ్య‌క్షుడు సిరిల్ రామ‌ఫోసా ఈ మధ్యే కోవిడ్ ప‌రీక్ష‌లో పాజిటివ్ తేలారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ప్రస్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ ఒకేరకంగా లేదని టెడ్రోస్ తెలిపారు. కొన్ని దేశాలు ఒమిక్రాన్ నివారణకు బూస్ట‌ర్ డోసులు ఇస్తున్నాయ‌ని చెప్పారు. కోవిడ్ వ్యాప్తిని బూస్ట‌ర్ డోసుల‌తో అడ్డుకోవ‌చ్చు అని, కానీ ఎవ‌రికి వ్యాక్సిన్ ఇవ్వాల‌న్న ప్రాముఖ్య‌త‌ను కూడా వైద్యులు గుర్తుంచుకోవాల‌న్నారు. అయితే, ఇంకా కొన్ని దేశాల‌లో అస‌లు వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ