హత్యకేసు ఆరోపణలపై రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ అరెస్ట్

Wrestler Sushil Kumar Arrested By Delhi Police in Murder Case

రెండుసార్లు ఒలింపిక్ విజేత, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ను ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ రెజ్లర్ హత్య కేసులో ప్రమేయమునట్టు ఆరోపణలు రావడంతో సుశీల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియంలో రెజ్లర్ల మధ్య జరిగిన ఘర్షణలో 23 ఏళ్ల సాగర్ అనే రెజ్లర్ మృతి చెందాడు. సుశీల్‌ కుమార్‌, అతని స్నేహితుల దాడి వల్లే సాగర్‌ చనిపోయాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు నమోదు అనంతరం దాదాపు 20 రోజులుగా సుశీల్ కుమార్ అరెస్టు నుండి తప్పించుకుంటూ పరారీలో ఉన్నాడని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న సుశీల్ కుమార్ సమాచారం అందించిన వారికీ లక్ష రూపాయల బహుమతిని కూడా పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మురం చేయగా, ఎట్టకేలకు జలంధర్ సమీపంలో సుశీల్ కుమార్ సహా ఈ కేసుతో సంబంధం ఉన్న అజయ్ కుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇటీవలే ఈ కేసు విషయంలో సుశీల్‌ కుమార్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ