సీపీఎం నేత సీతారాం ఏచూరి (72) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూయగా… ఆ తర్వాత.. ఆయన కోరిక మేరకు.. కుటుంబం సభ్యులు సీతారం పార్థీవదేహాన్ని ఎయిమ్స్‌కు దానం చేశారు. చివరి చూపుల అనంతరం ఏచూరి మృతదేహాన్ని ఈరోజు ఉదయం 11 గంటలకు సీపీఎం ప్రధాన కార్యాలయానికి అప్పగించనున్నారు. అయితే అవయవదానం కోసం ఆసుపత్రికి దానం చేసిన భౌతికకాయం ఏమవుతుందనేి ఆసక్తి జనాల్లో పెరిగింది.
నిజానికి దానం చేయబడిన శరీరం ఆసుపత్రికి వచ్చినప్పుడు.. అది అనాటమీ విభాగానికి వెళుతుంది. ఎంబీబీస్ విద్యార్థులు మృతదేహాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. మృతదేహాన్ని పలు భాగాలుగా విభజించి..శరీర భాగాలను ఎలా విడదీయాలనే దాని గురించి విద్యార్థులకు ప్రాథమిక జ్ఞానం వచ్చేలా వారికి ట్రైనింగ్ ఇస్తారు. విద్యార్థులను వివిధ సమూహాలుగా విభజించి.. వివిధ శరీర భాగాలను విడదీసే పనిని ఇస్తారు. శరీర నిర్మాణ శాస్త్రంలో, అంతర్గత అవయవాల యొక్క చిక్కులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మెడ, కడుపు, చేతులు, కాళ్లును విడిగా విడదీస్తారు. ఇలా మృతదేహాన్ని పూర్తిగా ఉపయోగించుకునే వరకు ఇది జరుగుతుంది. ఒకవేళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోతే.. ఎముకలను బయటకు తీసి ఈ ఎముకలతోనే తదుపరి అధ్యయనం కొనసాగిస్తారు.
అయితే చనిపోయిన ఒకటి లేదా రెండు రోజుల తరువాత, శరీరం కుళ్లిపోతుంది కాబట్టి..దానం చేసిన శరీరాన్ని రక్షించడం చాలా ముఖ్యం. దీని కోసం థీల్ టెక్నిక్ వాడతారు. దీనికలో డెడ్ బాడీపై పేస్ట్ వేయడం వల్ల మృతదేహం మృదువుగా ఉండి, అందులో బ్యాక్టీరియా పెరగదు. విద్యార్థులు దానిని తాకినా, కత్తిరించినా లేదా పట్టుకోవడంలో కూడా ఎటువంటి సమస్య ఉండదు. ఇది కాకుండా, ఈ మృతదేహంపై ఫార్మాలిన్ కూడా పూస్తారు. ఇది మృతదేహాన్ని మృదువుగా, సహజ రూపంలో ఉంచుతుంది. అలాగే మృతదేహంలోకి ఒక ద్రావణాన్ని కూడా ఇంజెక్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ శరీరాన్ని కావలసినంత కాలం ఉంచుకోవచ్చు.
పరిశోధనలు పూర్తి అయ్యాక..మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు తిరిగి ఇవ్వరు. అందుకే మృతదేహం కావాలని ఏ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకూ ఆస్పత్రికి దరఖాస్తు చేసిన ఘటనలు కూడా లేదు. కాకపోతే పరిశోధనల అనంతరం ఎవరైనా చితాభస్మం అడిగినా, ఆసుపత్రి వారు దానికి అంగీకరించి చితాభస్మాన్ని ఇవ్వొచ్చు. సాధారణంగా ఇది కూడా జరగదు. ఎముకలను విడదీసి, తొలగించిన తర్వాత.. ఆసుపత్రి నిబంధనల ప్రకారం.. అది పారవేయబడుతుంది. ఇక అవయవదానం చేశాక ఇంగ్లండ్‌లో అయితే డెడ్ బాడీని గరిష్టంగా 7 ఏళ్ల పాటు ఉంచాలనే కండిషన్ ఉంది.అయితే భారత్‌లో అలాంటి నిబంధనేమీ లేదు.