మహా కుంభమేళాకు ఎంచక్కా ఫ్లైట్‌లోనే వెళ్లొచ్చు..

You Can Go To The Maha Kumbh Mela By Flight, How To Go To The Maha Kumbh Mela, Way To Kumbh Mela By Flight, Go To The Maha Kumbh Mela By Flight, Holy Dip On Mauni Amavasya Day, Mauni Amavasya 2025, Maha Kumbh Mela, Naga Saints, Prayagraj, Kumbh Mela, Kumbh Mela A Grand Festival, Maha Kumbh Mela Prayagraj 2025, Maha Kumbh Mela 2025,Ganga, Godavari, Kaveri, Prayagraj, Tungabhadra, Yamuna, India, National News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లాలనుకునేవారు ఇకపై ఈజీగా వెళ్లి రావొచ్చు. ఇప్పటి వరకూ ఆకాశాన్ని తాకిన విమాన ఛార్జీలు ఇప్పుడు సగానికి తగ్గిపోయాయి. ఎయిర్‌లైన్ రెగ్యులేటర్ .. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కఠినమైన ఆదేశాలిచ్చిన తర్వాత ఎయిర్‌లైన్ కంపెనీలు ఏకపక్షంగా ఛార్జీలను పెంచడాన్ని బ్రేక్ చేసి ఛార్జీలను సగానికి తగ్గించవలసి వచ్చింది. దీంతో ఇప్పుడు విమానంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి సగం మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తే సరిపోతుంది.

ప్రయాగ్ రాజ్ కు వెళ్లే ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా, విమానయాన సంస్థలు ఫ్లైట్ ఛార్జీలను విపరీతంగా పెంచేసాయి. ఇది దేశంలోని ఇతర ప్రదేశాలకు విమాన ఛార్జీలను కూడా ప్రభావితం చేసింది. ప్రయాగ్‌రాజ్ విమాన ఛార్జీలను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టమైన సూచనలు ఇచ్చింది.ప్రయాగ్‌రాజ్ టిక్కెట్ ధరలను తక్కువగా ఉంచాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించిన తర్వాత, ఛార్జీలు బాగా తగ్గాయి. ప్రస్తుతం, టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఛార్జీని 10,000 రూపాయలుగా చూపిస్తున్నాయి. ఇది గతంలో 29 వేల రూపాయలు చూపేది. జనవరిలో ప్రయాగ్‌రాజ్‌కు 81 స్పెషల్ ఫ్లైట్స్ వేశారు.

ఆకాశ ఎయిర్ ప్రయాగ్‌రాజ్‌కు ఫ్లైట్ ఛార్జీలను 30-45 శాతం తగ్గించింది. దీంతో పాటు విమానాల సంఖ్యను పెంచింది. గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక విమానాలను ప్రారంభిస్తునట్లు ఆకాశా ఎయిర్ తెలిపింది. ఇది ముంబై, ఢిల్లీ నుంచి రోజువారీ ప్రత్యక్ష సేవలకు అదనంగా ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమానాల టిక్కెట్ ధరలను ఆకాశా ఎయిర్ 30-45 శాతం తగ్గించాయి.

మహా కుంభమేళా సమయంలో అన్ని విమానయాన సంస్థలు కలిపి 20 కోట్ల మంది ప్రయాణికులకు ప్రయాగ్‌రాజ్‌కు టూర్లను అందించగలవని అంచనా వేశారు. వీరిలో సుమారు 15 లక్షల మంది విదేశీ పర్యాటకులు కూడా ఉంటారన్న అంచనాలున్నాయి. తాజాగా ప్రయాగ్‌రాజ్ నుంచి దేశంలోని 17 నగరాలకు విమాన సౌకర్యం ఉన్నట్లు అధికారులు చెప్పారు.