కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఏప్రిల్ 10, శుక్రవారం నాడు లైవ్ సెషన్ నిర్వహించి కరోనా వైరస్ గురించి, లాక్‌డౌన్ సమయంలో పాటించాల్సిన పలు జాగ్రత్తలను ప్రజలు, అభిమానులకు తెలియజేశారు. ఈ సెషన్ లో “చేంజ్ మేనేజ్ మెంట్” అనే అంశం గురించి వివరించారు. ఈ లాక్‌డౌన్ సమయం మనకి కొన్ని కొత్త పాఠాలు నేర్పిందని, మనలో దాగిఉన్న టాలెంట్ ను మరోసారి గుర్తు చేసిందని చెప్పారు. మనం ఎప్పుడూ మార్పుకు సిద్ధపడాలని, ఏ మార్పుకు సిద్ధపడాలి.. తీసుకున్న నిర్ణయాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనే విషయాలను ఈ సందర్భంగా బీవీ పట్టాభిరామ్ గారు వివరించారు.
[subscribe]