ఏపీలో ఈఏపీ సెట్-2023 షెడ్యూల్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

AP EAPCET-2023 Detailed Schedule Released,AP EAPCET-2023,AP EAPCET Schedule Released,EAPCET-2023 Schedule,Mango News,Mango News Telugu,AP EAMCET 2023 Exam Dates Online,AP EAPCET 2023 Exam Dates Announced,AP EAPCET Latest News,AP EAPCET Live Updates,AP EAPCET-2023 Updates,AP EAPCET-2023 Latest News and Updates,AP EAPCET Schedule Updates,AP EAPCET Schedule Live

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఈఏపీ సెట్) షెడ్యూల్ విడుదలైంది. ఈ సంవత్సరం ఈఏపీ సెట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఏపీ ఉన్నత విద్యా మండలి అనంతపురం జేఎన్టీయూకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈఏపీ సెట్-2023 యొక్క వివరణాత్మక షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 10న నోటిఫికేషన్‌ విడుదలతో ఈఏపీ ప్రవేశ పరీక్ష ప్రక్రియ మొదలుకానుంది. ఈఏపీసెట్ ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు మే 15 నుంచి 18 వరకు జరగనుండగా, బైపీసీ స్టీమ్ ప్రవేశ పరీక్షలు మే 22, 23 తేదీల్లో ఆన్లైన్ టెస్ట్ విధానంలో జరుగనున్నాయి.

ఏపీ ఈఏపీ సెట్-2023 పూర్తి షెడ్యూల్‌:

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: మార్చి 10
  • దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభ తేదీ: మార్చి 11
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : ఏప్రిల్ 15
  • రూ.500 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30
  • రూ.1000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ:మే 1 నుంచి మే 5
  • రూ.5000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: మే 6 నుంచి మే 12
  • రూ.10,000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: మే 13 నుంచి మే 14
  • సబ్మిట్ చేసిన దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం: మే 4 నుంచి మే 6 వరకు
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : మే 7 నుండి
  • ఈఏపీ సెట్-ఎంపీసీ స్ట్రీమ్ పరీక్ష తేదీలు: మే 15 నుంచి 18 వరకు
  • ఈఏపీ సెట్- బైపీసీ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: మే 22, 23.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =