మహా శివరాత్రి హిందువులకు ఏటా వచ్చే పవిత్రమైన రోజు. ఇది శివ భక్తులకు ఎంతో ప్రాముఖ్యమైన పర్వదినం. అయితే ఈ సంవత్సరం వచ్చిన మహా శివరాత్రి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలని పండితులు అంటున్నారు. ఎందుకంటే దాదాపు 149 ఏళ్ల తర్వాత ఈ మహా శివరాత్రి వచ్చింది. గ్రహాల ప్రత్యేక సమయ క్రమం వల్ల అరుదైన సందర్భాన్ని మరింత ప్రత్యేకత కలిగిస్తుందని చెబుతున్నారు.
శివరాత్రి రోజు కుంభ రాశిలో సూర్యుడు, బుధుడు, శని గ్రహాలు ఉంటాయి. చాలా శక్తివంతమైన ఈ మూడు గ్రహాలు.. ఒకే రాశిలో ఉండడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన గ్రహ కలయిక ఈ మహా శివరాత్రికి ప్రత్యేకతను తీసుకువచ్చింది. సూర్యుడు, బుధుడు, శని గ్రహాలతో పాటు తొమ్మిది గ్రహాలు ఒకే లైనులో ఏర్పడిన సందర్భం 1965 వ సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 26న వచ్చిన మహా శివరాత్రి రోజు కూడా ఇదే గ్రహస్థితి ఉంటుంది. ఇలాంటి అరుదైన సమయంలో.. శివుడిని పూజించడం వల్ల భక్తులకు ప్రత్యేకమైన ఫలాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ గ్రహాల కలయిక జరిగిన అపూర్వ సందర్భంలో.. శివుడిని భక్తితో పూజించడం వల్ల వ్యక్తుల కోరికలు నెరవేరతాయని పండితులు చెబుతున్నారు. శివరాత్రి పర్వదినం అంటేనే చాలా పవిత్రమైనది..అలాంటిది నవ గ్రహాలు ఒకే గీతలా కనిపించే ఈరోజు శివుణ్ని అభిషేకం చేసి సంతోషపరిస్తే తమ కోరికలు సఫలమవుతాయని అంటున్నారు. ఇది భక్తుల కోసం ఒక అరుదైన అవకాశమని చెబుుతున్నారు
మహా శివరాత్రి రోజు శుక్రుడు మీన రాశిలో ఉంచబడతాడు. మీన రాశి అంటే శుక్రుని ఉచ్చస్థానం. ఇది చాలా శుభంగా భావించబడుతుంది. అలాగే రాహువు కూడా అక్కడే ఉంటుంది. శుక్రుడు మీన రాశిలో ఉండటం అనేది సుమారు 149 ఏళ్ల తర్వాత జరుగుతోంది కాబట్టి ఈ మహా శివరాత్రి మరింత ప్రత్యేకత కలిగిందని వేద పండితులు చెబుతున్నారు. ఈ అరుదైన గ్రహ కలయిక రోజు పరమ శివుణ్ని పూజించడం వల్ల జీవితంలో మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.