శ్రీ రామానుజాచార్యుల బోధలు సర్వమానవాళికి ఆదర్శం.. ప్రధాని మోదీ

హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (శనివారం) సాయంత్రం ఒక చారిత్రిక ఘట్టం ఆవిష్కృతమైంది. వసంత పంచమి పర్వదినం సందర్భంగా ప్రధాని మోదీ..  ‘శ్రీరామానుజాచార్య విరాట్’ (సమతామూర్తి) విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా.. తిరునామంతో, సంప్రదాయ వస్త్రధారణతో సరికొత్తగా కనిపించారు ప్రధాని మోదీ. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. శ్రీ రామానుజాచార్యుల నామం స్మరిస్తూ ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే..

“శ్రీ రామానుజాచార్యుల బోధలు అందరికీ ఆదర్శం. గురువు ద్వారానే మనకు జ్ఞానం లభిస్తుంది. ఒకేచోట 108 దివ్యదేశాలను సందర్శించిన అనుభూతి కలిగింది. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అనుగ్రహంతో నాకు ఇక్కడ విష్వక్సేనేష్టి పూజలో పాల్గొనే అదృష్టం లభించింది. జ్ఞాన, వైరాగ్య భావాలకు ఈ విగ్రహం ప్రతీక. సామాజిక న్యాయం అందరికీ అందాలి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ విగ్రహం మనకు స్ఫూర్తి మాత్రమే కాదు, భారతీయ వైభవానికి ప్రతీక.”

“శ్రీ రామానుజులు చెప్పిన విధంగానే.. మా ప్రభుత్వం దేశంలోని అణగారిన వర్గాల ప్రజలను కూడా సమంగా చూస్తోంది. అభివృద్ధి ఫలాలు వారికి కూడా అందిస్తోంది. ఇక్కడి తెలుగు నేల ఎంతో గొప్పది. ఎంతోమంది మహానుభావులను అందించింది ఈ పుణ్యభూమి. గొప్ప గొప్ప రాజులను.. రాణులను.. కవులను.. పండితులను.. స్వాతంత్య్ర సమరవీరులను భారతదేశానికి అందించింది. అందుకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఈ క్షేత్రం ఒక పవిత్ర యాత్రా స్థలం అవుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 14 =