దీపాల వెలుగులో దేవుడిని పూజించే రోజు దీపావళి. దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే దీపావళికి లక్ష్మీ పూజ, గణేష్ పూజ చేయడంతో పాటు స్వీట్లు తిని సంబరాలు చేసుకుంటారు. వాటితో పాటు క్రాకర్స్ పేల్చి చిన్నా పేద్దా అనందోత్సహాల్లో మునుగుతారు. టపాసుల శబ్ధాలతో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. దీపావళి రోజు.. టపాసుల మోత లేకపోతే కొందరికి పండగ చేసుకున్నట్లు ఉండదు. ఐతే, ఈ టపాసుల శబ్ధాలు, పొగ కారణంగా పర్యావరణం, మన ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి.
మనం ఎన్నో వేలు ఖర్చు చేసి మోత మోగించే.. క్రాకర్స్ కారణంగా గాలిలో దుమ్ము, కాలుష్య కారకాల సాంద్రత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అంతే కాదు క్రాకర్లు పేల్చేటప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా క్రాకర్స్ పేల్చేటప్పుడు చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ ఫైర్ క్రాకర్స్ సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
పటాకులు కాల్చేటప్పుడు కళ్లు, నోరు, చేతులు, కాళ్లు, శరీరం మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం అజాగ్రత్త వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
బాణసంచా కాల్చే సమయంలో పేలిన శబ్దం చెవుల్లో సమస్యలను కలిగిస్తుంది. దీనిని నివారించడానికి చెవులను రక్షించడానికి కాటన్ ఉపయోగించండి.
బాణాసంచా ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో కాల్చండి. లేదా ఇంటికి దగ్గరి ప్రదేశంలో కాల్చవద్దు. ఇలా చేయడం వల్ల ప్రమాదం జరగవచ్చు.
క్రాకర్లు పేల్చేటప్పుడు తగినంత దూరం పాటించండి. చిన్న క్రాకర్లు ఉన్నప్పుడు ప్రజలు వాటిని వారి చేతుల్లో కాల్చడానికి ప్రయత్నిస్తారు. అలా చేయకుండా ఉండేలా చూడాలి. బాణాసంచాకు నిప్పు అంటించిన తర్వాత వాటికి దూరంగా ఉండాలి.
పిల్లలను ఒంటరిగా బాంబులు పేల్చడానికి అనుమతించవద్దు. బాణసంచా కాల్చే సమయంలో దగ్గరలో ఒక బకెట్ నీరు ఉంచండి. దీంతో ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.
క్రాకర్లు పేల్చేటప్పుడు ఎవరైనా కాలిన లేదా గాయమైనప్పుడు వెంటనే చల్లని నీరు పోయాలి. తర్వాత దానిపై కొబ్బరి నూనె రాయాలి.
కాలిన భాగాన్ని 15-20 నిమిషాల పాటు నీటి కింద ఉంచండి, ఇలా చేయడం వల్ల మంట తగ్గుతుంది. ఐస్ ఉపయోగించవద్దు, ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. బర్నోల్, టూత్‌పేస్ట్‌ను పూయవద్దు అవి చర్మం శ్వాస తీసుకోకుండా నిరోధిస్తాయి. వీటికి బదులుగా యాంటీబయాటిక్స్ వాడండి. ఆ తర్వాత గ్లాస్ క్లాత్‌తో డ్రెస్ చేయండి.
మీరు బర్నింగ్ విషయంలో కూడా క్రిమినాశక క్రీమ్ ఉపయోగించవచ్చు, కానీ తీవ్రమైన గాయం అయితే వెంటనే డాక్టర్ సంప్రదించండి.