
కలియుగంలో దేవుళ్ల కంటే దేవుళ్ల ప్రతిరూపాలుగా చెప్పుకునే గురువులనే ఎక్కువ మంది నమ్ముతున్నారంటే అది అతి శయోక్తి కాదు. అందుకే వారి ఆదాయం ప్రసిద్ధ దేవాలయాలకు వచ్చే కంటే ఎక్కువగా వస్తుంది. అందుకే తాము దైవాంశ సంభూతులుగా చెప్పుకునే ఆధ్యాత్మిక గురువుల ముందు నిత్యం అనేకమంది తమ సమస్యలను చెప్పుకోవడానికి క్యూ కడుతూ ఉంటారు.
ఒక్క భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోని వివిధ దేశాలలఅలాంటి గురువుల వద్దకు వెళ్లి వారి ప్రవచనాలను వినడానికి వస్తుంటారు. అందుకే భారత దేశంలో కొందరు ఆధ్మాత్మిక గురువులు.. మిలియన్ల భక్తులను సంపాదించుకోవడంతో పాటు కోట్ల కొద్దీ ఆస్తులను కలిగి ఉన్నారు.
సత్ గురువు జగ్గీ వాసుదేవ్ గురించి భారతదేశంలో తెలియని వారుండరు. ఇప్పుడున్న ఆధ్యాత్మిక గురువులందరిలో సత్ గురువు జగ్గీ వాసుదేవ్ టాప్ స్థానంలో ఉన్నారట. సత్ గురువు జగ్గీ వాసుదేవ్ ఆస్తుల విలువ సుమారు రూ. 250 కోట్లు పైనే ఉంటుందని అంచనా. చాలా మంది సెలబ్రిటీలలోనూ ఆయనకు భక్తులు ఉన్నారు. ఇషా ఫౌండేషన్‌ను స్థాపించి.. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. సత్ గురువు జగ్గీ వాసుదేవ్‌కు యోగా సెంటర్లు, విద్యా సంస్థలతో పాటు ప్రకృతిని కాపాడే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి, శివతత్వం అంటే ఏంటి, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి వంటి ఎన్నో విషయాలను తన భక్తులకు చెబుతూ వుంటారు. చెన్నైకు చెందిన సత్ గురువు జగ్గీ వాసుదేవ్‌కు కోయంబత్తూర్‌లో ఆదియోగి సెంటర్ అనే పెద్ద ఆశ్రమం ఉంది.
భారతదేశంలో యోగాలో బాబా రాందేవ్‌కు మించిన గురువు లేరన్నంతగా ఆయన పేరు పొందారు. పతంజలి ప్రోడక్ట్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా తన బిజినెస్‌ను విస్తరించుకున్నారు. తాజాగా ఆయన ప్రొడెక్టుల నాణ్యతపై తీవ్ర విమర్శలు రావడంతో చాలా ఉత్పత్తులను బ్యాన్ చేశారు . మరోవైపు రామ్ దేవ్ బాబా నార్త్ సైడ్ ఎన్నో యోగా సెంటర్లను కూడా స్థాపించారు. ఈయన ఆస్తుల విలువ మొత్తం రూ. 17వందల కోట్లకు పైనే ఉంటుందన్న వార్తలు ఉన్నాయి.దేశంలో ఉన్న ప్రసిద్ధ గురువుల్లో ఆశారాం బాపు కూడా ఒకరు ఈయనకు మొత్తం 350కి పైగా ఆశ్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆశారం బాపునకు చెందిన ట్రస్టు ఏడాదికి 350 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉంటుందని అంచనా. ఆశారాం బాపునకు కూడా దేశ వ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఉన్నారు.
అందరి గురువులలో నిత్యానంద స్టైలే వేరు.సీనియర్ హీరోయిన్ రజితతో కలిసిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా ఆయన అప్పుడు ఫేమస్ అయిపోయారు.ప్రపంచంలోని ఒక చోట ఒక చిన్న దీవిని కొనుగోలు చేసి..ఏకంగా దానికి కైలాసం అని నామకరణం చేసి అదే ఈ భూమిపై పవిత్రమైన స్థలంగా చెబుతున్న గురువు నిత్యానంద. ఈయన నిత్యానంద ధ్యానఫీఠ ఫౌండేషన్‌ను స్థాపించడంతో పాటు. ఎన్నో గురుకులాలను, ఆశ్రమాలను నడిపిస్తున్నారు. సంవత్సరానికి ఈయనకున్న ట్రస్టుల టర్నోవర్ రూ. 10 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
మరోవైపు ఎంతోమందికి అమ్మగా మాతా అమృతానందమయి చాలా గుర్తింపును పొందారు. అమ్మగా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సాధించుకున్న ఆమె ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.. ఆమె ఆస్తుల విలువ రూ.18వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. మాతా అమృతానందమయి ట్రస్టు కింద స్కూల్స్, కాలేజీలు కూడా ఎన్నో ఉన్నాయి.
శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌ను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పెద్ద పేరు సంపాదించుకున్నారు. మొత్తం 150 దేశాల నుంచి చాలా మంది భక్తులు శ్రీశ్రీ రవిశంకర్ ను అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే శ్రీశ్రీ రవిశంకర్‌కు 30 కోట్ల మంది భక్తులు ఉన్నట్లు అంచనా. ఈయన ఆస్థుల విలువ సుమారు రూ.15వందల కోట్ల వరకు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా ఇంకా చాలామంది ఆధ్యాత్మిక గురువులు తమతమ విధానాలు, మాటలతో ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY