జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. శనిగ్రహం అనేది జాతకంలో శుభ స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి పేదవాడు కూడా ఉన్నపళంగా ధనవంతుడవుతాడు అన్నిరకాలుగా బాగుంటుంది. అదే శనిగ్రహం అశుభ స్థానంలో ఉంటే మాత్రం మనుషులకు రకరకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
కాగా శని గ్రహ సంచారం వల్ల ఈ ఏడాది ఆగస్టు నెల చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆగస్టు 18న శని సంచారం చేయబోతోందట. శనివారం రాత్రి 10:03 గంటలకు శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడట. దీంతో ఈ ఏడాది ఆగస్టు 17నే శని త్రయోదశి రాబోతుంది.అయితే ఈ నక్షత్ర సంచారానికి ొక ప్రత్యేకత ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ నక్షత్రంలో శని గ్రహం దాదాపు అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉండనుందని… దీని వల్ల కొన్ని రాశుల వారి జీవితాలపై దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు.
శని సంచార ప్రభావం కుంభరాశిలో ఉండడం వల్ల.. కుంభ, మకర ,మీనరాశుల వారిపై శని ప్రభావం మరింత పెరిగే అవకాశముందట. అంతేకాక ఈ సమయంలో కొన్ని కొన్ని పనులు చేస్తే ఈ 3 రాశుల వారికి కాస్త ఉపశమనం లభించొచ్చని పండితులు చెబుతున్నారు. దీంతో ఈ 3 రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆగస్టు 17.. శని త్రయోదశి రోజున కొన్ని నియమాలు పాటించడం వల్ల.. ఈ రాశుల వారికి అశుభ ఫలితాలు తగ్గుతాయని..అనుకున్న పనులు జరుగుతాయని అంటున్నారు.
శని దేవుడుని ప్రసనం చేసుకోవడానికి ఆగస్టు 17న .. కుంభ, మకర ,మీన రాశి వారు తప్పకుండా శని ఆలయాన్ని దర్శించి తైలాభిషేకం చేసి.. ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. అలాగే శని దేవుడి విగ్రహం ముందు ..ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
అలా దేవాలయానికి వెళ్లలేని వాళ్లు ఉసిరి చెట్టు ముందు దీపం వెలిగించి శని సూత్రాన్ని పఠించడం వల్లకూడా సర్వ పాపాలు తొలగి సుఖ సంతోషాలతో గడుపుతారు.అలా కూడా చేయలేనివాళ్లు పేదవారికి నల్లటి వస్త్రాలను దానం చేస్తే శని దేవుని అనుగ్రహం పొందేలా చేస్తుంది.
అంతేకాకుండా శని గ్రహానికి సంబంధించిన చెడు ప్రభావం నుంచి విముక్తి పొందాలనుకునేవారు..ఈరోజు కచ్చితంగా హనుమంతుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే మంచి జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అంతేకాకుండా మిగిలిన రాశుల వారు కూడా వారు అనుకున్న ఫలితాలను పొందడానికి నవగ్రహ పూజ చేయడంతో పాటు శని గ్రహానికి నువ్వుల నూనెతో పూజ చేయాలి. ఈరోజు ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిప్తే శనిదేవుడు కరుణిస్తాడుని అంటున్నారు.