ఆ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Mauni Amavasya,What is Mauni Amavasya?,NO Nonveg, Magha Amavasya, Amavasya,Donating, Maun means silence, Maagha month, Mauni Amavasya 2024, hindu mythology, hindu customs, traditions, Hindu calendar, Mango News Telugu, Mango News
Mauni Amavasya,What is Mauni Amavasya?,NO Nonveg, Magha Amavasya, Amavasya,Donating

మాఘ మాసంలో వచ్చే కృష్ణ పక్ష అమావాస్యను మాఘ అమావాస్య అని లేదా మౌని అమావాస్య అని అంటారు. ఈ రోజు సముద్రం లేదా పవిత్ర నదీ స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. మౌని అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానమాచరించి ఆ తర్వాత దానం చేయడం వల్ల మనుషులను వేధించే .. బాధలు, పాపాలు నశించి పుణ్యాన్ని పొందుతారట.

ఈ ఏడాది మౌని అమావాస్య 9 ఫిబ్రవరి 2024 న వచ్చింది. మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిదట. అలాగే  కొన్ని చేయాల్సిన పనులు, చేయకూడని పనులు కూడా ఉన్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఫిబ్రవరి 9 ఉదయం 8.02 నుంచి మాఘమాసం మౌని అమావాస్య ప్రారంభమవుతుంది. ఇది  ఫిబ్రవరి 10 తెల్లవారుజామున 4:28 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం..ఫిబ్రవరి 9న  ఉదయం 8:02 నుంచి 11:15 మధ్యలో స్నానం చేయడం, దానం చేయడం చాలా శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.

మౌని అమావాస్య రోజు  పవిత్ర నదిలో కానీ సముద్రం  స్నానం కానీ చేస్తే మంచిదని పండితులు చెబుతారు. ఈ రెండూ అందుబాటులో లేకపోతే బకెట్‌లో నీళ్లు నింపుకుని కూడా  స్నానం చేయవచ్చట. స్నానం చేసాక  సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తూ ఆరాధించాలి. ఆ తర్వాత  ఇంట్లో  దీపారాధన చేసి   ఇష్ట దైవారాధన చేసుకోవాలి.

మౌని అమావాస్య రోజు దానధర్మాలు చేయాలని పండితులు చెబుతారు. ఆ రోజు పూజాధికార్యక్రమాల  తర్వాత చేసే వస్త్ర, నవధాన్యాలు వంటి దానం.. గొప్ప దానంగా పరిగణించబడుతుందట. అంతే కాకుండా ఆ రోజు  రావి చెట్టును పూజించడం, రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. మౌని అమావాస్య రోజు మౌనవ్రతం పాటించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుందట. మౌన వ్రతం పాటించలేకపోతే  ఆ రోజు ఎంత తక్కువ వీలయితే అంత తక్కువగా మాట్లాడటానికి చూడాలట.

మౌని అమావాస్య రోజు  మాంసం అస్సలు తినకూడదట. అలాగే ఆరోజు అబద్ధాలు చెప్పడకూడదట. ఈ రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదట. ఎవరితోనూ గొడవ పడకూడదట..గొడవ పడితే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయట. అలాగే మౌని అమావాస్య రోజు శరీరానికి ఆయిల్‌తో మసాజ్ చేయకూడదట.

మౌని అమావాస్య రోజు దేవతలు, మన పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని పెద్దలు నమ్ముతారు. అందుకే ఈ రోజు ఎవరైనా నదీ స్నానం చేసి దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుందని అంటారు. అంతేకాదు జీవించినంత కాలం ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని చెబుతారు.  జీవితంలో ఆనందం, శాంతి కలిగి జీవితంలో వేధించే సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయట.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE