లైట్‌హౌస్ పేరెంటింగ్ అనేది పిల్లలకు అద్భుతమైన మార్గదర్శకం అని నిపుణులు తెలిపారు. ప్రతి పేరెంట్స్ కూడా తమ పిల్లలకు మెరుగైన జీవితం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ పేరెంటింగ్ టెక్నిక్ విధానంతో వాళ్లు పెద్దయ్యాక స్వతంత్రంగా వ్యవహరించడంలో కూడా సాయపడుతుంది.
సముద్రంలోని ఓడలను లైట్‌హౌస్‌తో సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు లైట్‌హౌస్ పేరెంటింగ్ దిశను అందిస్తుందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో పిల్లలు వారి సొంత మార్గాల్లో పయనించేలా చేస్తుందని చెబుతారు ఈ పేరెంటింగ్ విధానం వల్ల పిల్లలు చాలా బాధ్యతయుతంగా ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు.
లైట్‌హౌస్ పేరెంటింగ్ అంటే పిల్లలను సక్రమ మార్గంలో పెట్టడంలో ఉపయోగించే విధానం. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తూనే..వారిని బ్యాలెన్స్ చేయాలి. దీనిలో పిల్లలకి తమను తాము ఎంచుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఈ విధానాన్ని అమలు చేసే వారు తమ పిల్లలకు తప్పులు చేయడానికి, నిజాయితీగా మాట్లాడడానికి వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతి అవసరమైనప్పుడు సాయం కోసం అడగమని పిల్లలను ప్రోత్సహిస్తుంది.దీనివల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుంది.
లైట్‌హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.. పిల్లల ఆత్మగౌరవంపై సానుకూల ప్రభావం చూపుతుంది. లైట్‌హౌస్ పేరెంట్స్ తమ పిల్లలకు సొంతంగా ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తారు. కానీ, వారికి కొన్ని హద్దులను నిర్దేశిస్తారు. పిల్లలు తమ ఆత్మవిశ్వాసం, స్వాతంత్ర్యం వంటి ముఖ్యమైన జీవితా నైపుణ్యాలను నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమను విశ్వసిస్తున్నారని తెలుసుకోవడం ద్వారా పిలల్లలోనూ విశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవటానికి వారికి శక్తినిస్తుంది.
ఈ పేరెంటింగ్ విధానానికి కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. పిల్లలు తమ తల్లిదండ్రులను విమర్శిస్తారనే భయం లేకుండా సుఖంగా ఉన్నప్పుడు సంబంధాలు బలపడతాయి. వారు తమ తల్లిదండ్రులను నమ్మదగిన సలహాదారులుగా భావిస్తే.. పిల్లల్లో ఆత్మస్థైర్య భావం పెరుగుతుంది. లైట్ హౌస్ పేరెంటింగ్ విధానంలో పిల్లలు ఎదురుదెబ్బలను అనుభవించేలా చేస్తుంది. అలాగే అవసరమైనప్పుడు సాయం కోసం అడగడంలో వారికి మద్దతునిస్తుంది. దీనివల్ల పిల్లలలో తమ భావాలను, ఇబ్బందులను వారే సొంతంగా నిర్వహించగల సామర్థ్యం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే పెద్ద సమస్యలతో ఫైట్ చేయడానికి వారిని సిద్ధం చేస్తుంది.
లైట్ హౌస్ పేరెంటింగ్ విధానంతో అనేక ప్రయోజనాలను ఉన్నా కూడా ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుందని నిపుణులు అంటారు. దీనివల్లే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలు ఎదుర్కోనే విషయంలో వెనుకడుగు వేస్తుంటారని అంటారు. నిజానికి ఫెయిల్యూర్ అనేది నేర్చుకోవడంలో ఒక భాగం..అలాగే దీనికి చాలా సహనం కూడా అవసరం. పిల్లల విషయంలో పేరెంట్స్ ఎప్పుడు జోక్యం చేసుకోవాలనేదానిపై లైట్‌హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి.
ఒకవేళ ఈ లైట్ హౌస్ పేరెంటింగ్‌పై ఎవరికైనా ఆసక్తి ఉంటే.. కొన్ని విషయాలు తప్పక పాటించాలి. మీ పిల్లల వయస్సు ప్రకారం.. వారి విషయంలో మీ జోక్యం చేసుకోవడం అనేది మారాల్సి ఉంటుంది. పెద్ద పిల్లలు వారికి వారే అర్థం చేసుకోగలరు. కానీ, యూత్ తోనే కాస్త కష్టం వారికి మరింత ప్రయోగాత్మక గైడెన్స్ అవసరం. క్లియర్ గైడెన్స్ పాటిస్తూనే పిల్లల పట్ల ప్రేమను కూడా వ్యక్తపరచాలి.
దీనివల్ల యుక్త వయస్సుకు వచ్చిన పిల్లలు మీ ప్రేమను అర్ధం చేసుకుని వారి భవిష్యత్తు కోసమే అలా ప్రవర్తించినట్లు అర్దం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు తెలివిగా వ్యవహరించడానికి వీలుంటుంది.అంతేకాకుండా ఫెయిల్యూర్ అనేది ఒక గొప్ప పాఠం అని తప్పుల వల్లే జీవితంలో ఎదగాలనే విషయాన్ని పిల్లలకు అర్దం అయ్యేలా చేస్తుంది.