భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు.. హాజరైన పలువురు ప్రముఖులు

Grand Celebrations of Sri Rama Navami Festival at Bhadrachalam Temple, Sri Rama Navami Festival at Bhadrachalam Temple, Sri Rama Navami Festival Grand Celebrations at Bhadrachalam Temple, Sri Rama Navami Festival Celebrations at Bhadrachalam Temple, Grand Celebrations of Sri Rama Navami Festival, Bhadrachalam Temple Sri Rama Navami Festival, Bhadrachalam Temple Sri Rama Navami Festival Grand Celebrations, Sri Rama Navami Festival Celebrations, Sri Rama Navami Festival Celebrations Latest News, Sri Rama Navami Festival Celebrations Latest Updates, Sri Rama Navami Festival Celebrations Live Updates, Bhadrachalam Temple, Sri Rama Navami Festival celebrated in traditional manner at Bhadrachalam Temple, Sri Rama Navami, Mango News, Mango News Telugu,

తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం ఆదివారం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. శ్రీరాముని జన్మదినంతో పాటు కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం నిర్వహించారు. తదుపరి మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ ముందుగా పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన చేసిన అనంతరం యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు నిర్వహించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు.

ఈ మహోత్సవానికి సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు భక్తులు హాజరయ్యారని భద్రాచలం దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీరాముడి కల్యాణ వేదిక మిథిలా స్టేడియంలో రాష్ట్ర దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఆలయ అధికారులు భక్తుల కోసం టెంట్లను ఏర్పాటు చేశారు. సంప్రదాయం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా శ్రీరాముడికి ‘పట్టు వస్త్రాలు’ మరియు ‘తలంబ్రాలు’ అందజేయటం ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల భద్రాచలం పర్యటన చేయనున్నారు. దీనిలో భాగంగా ముందుగా ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =