కొత్త సంవత్సరం 2025కి స్వాగతం చెప్పే సమయం దగ్గరపడుతోంది. కానీ ఆ జరిమానాలు, అదనపు ఖర్చులు లేకుండా నవ్వుతూ కొత్త ఏడాదిని ఆరంభించాలంటే, కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులను డిసెంబర్ 31, 2024లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
1. ఇంకా ఐటీఆర్ దాఖలు చేయలేదా?
గత ఆర్థిక సంవత్సరం 2023-24కి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) సంబంధించి ఐటీఆర్ గడువు జులై 31తో ముగిసినా, రివైజ్‌డ్ లేదా బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంది. ఆలస్యంగా దాఖలు చేస్తే రూ.1000 నుంచి రూ.5000 వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది. గడువు దాటితే మరింత గణనీయమైన చర్యలు ఎదురవుతాయి.
2. స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ ఛాన్స్ మిస్ కాకండి!
కొందరు బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ అందిస్తున్నాయి, కానీ వాటి గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది.
ఐడీబీఐ బ్యాంక్ ఉత్సవ్ ఎఫ్‌డీ: 300, 375, 444, 700 రోజుల టెన్యూర్లపై అధిక వడ్డీ రేట్లు.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ: 222 రోజులకు 7.20% వడ్డీతో పాటు 444, 777, 999 రోజుల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.
3. పెరుగనున్న క్రెడిట్ కార్డు ఛార్జీలు!
ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలు జనవరి 1, 2025 నుంచి నెలకు 3.75 శాతానికి పెరుగుతున్నాయి.
4. కార్ల ధరలు పెరుగుతున్నాయి!
కొత్త ఏడాది నుంచి టాటా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, నిస్సాన్, కియా వంటి కంపెనీలు కార్ల ధరలను 2-5% పెంచనున్నాయి. డిసెంబర్ 31లోపు కొనుగోలు చేస్తే ఈ అదనపు ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలను సజావుగా సాగదీయడానికి, ఈ వివరాలను దృష్టిలో పెట్టుకోండి!