ఆయుర్ధాయం తగ్గించేస్తున్న టైప్ 2 డయాబెటిస్

Type 2 diabetes reducing life expectancy,Type 2 diabetes,reducing life expectancy,diabetes reducing life,Mango News,Mango News Telugu,life expectancy,Type 2 Diabetes Life Expectancy,Potential Gains in Life Expectancy,Life expectancy associated with different ages,Life Expectancy with Type 2 Diabetes,Type 2 diabetes Latest News,Type 2 diabetes Latest Updates,Type 2 diabetes Live News

డయాబెటిస్ ప్రాణం తీసేంత పెద్దది కాకపోయినా శారీకంగా కృంగదీసి.. ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే మధుమేహం రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు . ఒకవేళ వస్తే మాత్రం దానిని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు టాబ్లెట్లు వాడుతూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇప్పటి వరకూ మధుమేహం నియంత్రణలో లేకపోతే అవయవాల పనితీరు దెబ్బతింటుందనే అనుకున్నారు కానీ ఆయుర్ధాయం కూడా తగ్గిపోతుందని తాజా పరిశోధనల్లో తేలింది.

ఒకప్పుడు 40 దాటితే కనిపించే డయాబెటిస్ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండానే కనిపిస్తోంది. చిన్నపిల్లలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా యువకుల్లోనూ మధుమేహ బాధితులు పెరుగుతున్నారు. 30 ఏళ్లలోపు టైప్-2 డయాబెటిస్ బారిన పడితే వారి జీవిత కాలం తగ్గిపోతోందని.. అంతర్జాతీయ పరిశోధకుల బృంధం తాజా పరిశోధనల్లో తేల్చింది. 30 సంవత్సరాల లోపు వారు డయాబెటిస్ బారిన పడితే.. వారి జీవిత కాలం ఏకంగా..సగటున 14 ఏళ్లు తగ్గిపోతుందని తేలింది.

30 సంవత్సరాల లోపు వారికే కాదు 50 ప్లస్ వాళ్లలో కూడా డయాబెటిస్ నిర్ధారణ అయితే.. వారికి కూడా వారి జీవితకాలం క్షీణిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. వీళ్లు జీవించే కాలం సగటున ఆరేళ్లు తగ్గుతుందని పరిశోధనలో తేలింది. అదే 40 సంవత్సరాల వాళ్లు మధుమేహం బారిన పడితే వారి 10 సంవత్సరాల జీవితం కాలం తగ్గుతుంది. అదే మహిళల్లో కనుక చూసినట్లయితే 30 ఏళ్లలోపు వారిలో మధుమేహం బయటపడితే 16 సంవత్సరాలు, 40 ఏళ్ల వారిలో ఇది బయటపడితే 11 సంవత్సరాలు, 50 ఏళ్ల వారిలో డయాబెటిస్ నిర్ధారణ అయితే 7 ఏళ్ల చొప్పున జీవిత కాలం తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 19 ఎక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలపై.. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో పరిశోధకులు డయాబెటిస్‌పై అధ్యయనం చేశారు. ఈ అధ్యయన వివరాలన్నీ లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ పత్రికలో ప్రచురితమయ్యాయి. డయాబెటిస్‌ను తగ్గించడం లేదా రాకుండా చేసుకోవడానికి కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.

డయాబెటిస్ ఊబకాయం ఉన్నవాళ్లలో ఎక్కువగా వస్తుంది. నిజానికి ఒబెసిటీ సరైన ఆహారం తీసుకోకపోవటంతోనే ఎక్కువగా వస్తుంది. సమతుల ఆహారం తినడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, సమయాలతో సంబంధం లేకుండా ఆహారం తీసుకోవటం, శరీరక వ్యాయామం లేకపోవటం వంటి జీవనశైలితోనే డయాబెటిస్ బాధితులు పెరుగుతున్నారు. ముఖ్యంగా టైప్2 డయాబెటిస్ కేసులు పెరటానికి ఈ కారణాలు అని ఈ అధ్యయనం తెలిపింది.

2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మంది వృద్ధులు.. మధుమేహంతో బాధపడినట్లు పరిశోధకులు తేల్చారు. అయితే ఇప్పుడు యువతరంలో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతుంది.
టైప్2 డయాబెటిస్ వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కేన్సర్ బారిన పడే అవకాశాలున్నాయి. మధుమేహం రిస్క్ ఉన్న వారిని ముందుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటే దీన్ని నివారించొచ్చని అధ్యయనం సూచిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =