మనం డైలీ తినే బియ్యం, కూరలు చివరకు మనుషులు, జంతువులకు కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. కానీ ఒక్క తేనెకి మాత్రం అసలు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. తేనె ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. తేనెలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి, చర్మం కాంతివంతంగా ఉంచడంలో తేనె సాయపడుతుంది.
తేనె ఎక్స్‌పైరీ కాకపోవడానికి ఓ కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి తేనెలో 17 శాతం నీరు ఉంటుంది. ఈ నీటిశాతం తేనె చెడిపోకుండా చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని అంటున్నారు. తేనెలో తక్కువగా నీటి శాతం ఉండటం వల్ల ఇది బ్యాక్టీరియాను నిర్జలీకరణం చేస్తుంది. దీనివల్లే తేనె ఎప్పటికీ పాడవకుండా ఉంటుంది.
అలాగే తేనెలో ఆమ్లత్వం కూడా 3.9 శాతం మాత్రమే ఉంటుంది. తేమను పీల్చుకునే సామర్థ్యం తేనెకు ఉండటం వల్ల తేనె ఎప్పటికీ పాడవకుండా ఉంటుంది. రోజులు, సంవత్సరాలు అయినా కూడా తేనె ఎప్పటికీ అలాగే ఉంటుంది. సహజ తేనె అయితే ఎప్పటికీ పాడవదు కానీ కల్తీ తేనె అయితే పాడయిపోతుంది.
అయితే తేనెను ప్లాస్టిక్ కంటైనర్లలో కాకుండా గాజు సీసాలలో ఉంచితేనే స్వచ్ఛంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్ సీసాలలో పెడితే తేనె నాణ్యత, పోషకాలు తగ్గిపోతాయి. దీనివల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. సాధారణంగా తేనెలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ,చర్మం, ఆరోగ్యం వంటి వాటికి తేనె ఉపయోగపడుతుంది.
రోజూ గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. తేనెలోని పోషకాలు, ఖనిజాలు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. అయితే సహజ తేనెను తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ రసాయనాలు ఉండే తేనెను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. కాబట్టి తేనెను తీసుకునే ముందు ..అది సహజమైనదో కల్తీ తేనో తెలుసుకుని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.