నార్త్‌లో సంగతి ఎలా ఉన్నా.. సౌత్‌లో చాలామంది ప్రతీరోజు అన్నాన్నే తింటారు. ప్రతీ ఒక్కరూ ముందుగా ఆ బియ్యాన్ని కడిగే అన్నం వండుతారు. కొంతమంది ఆ నీటిని మొక్కలకు పోస్తే.. చాలామంది ఆ నీటిని సింక్ లోనో పారబోస్తారు. కానీ ఆ నీటిని పారబోయకుండా సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ బియ్యం కడిగిన నీళ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి బియ్యం కడిగిన నీళ్లకు ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ బియ్యం కడిగిన నీళ్లు ఎన్నో ఆరోగ్య సమస్యలకు,బ్యూటీ సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆయుర్వేదం చెబుతోంది. బియ్యం కడిగిన నీటిలో ఎన్నో ఖనిజాలు,విటమిన్స్, అమైనో యాసిడ్స్ వంటివి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే బియ్యాన్ని ఒకసారి కాకుండా మూడు సార్లు కడిగి ఆ నీటిని వాడాలి. మొదటగా కడిగిన బియ్యం నీటిలో డస్ట్ ఉంటాయి కాబట్టి అవి పారబోయాలి. ఇప్పుడు మూడోసారి నీటిని పోసి ఒక అరగంట అలా వదిలేసి ఈ నీటిని మరో పాత్రలోకి వంపాలి. అంతే బియ్యం కడిగిన నీటిని ఫ్రిజ్‌లో పెట్టి రెండు,మూడు రోజులు వాడుకోవచ్చు. బియ్యం కడిగిన ఆ నీటిలో కాటన్ ముంచి ముఖానికి, మెడకు రాసుకొని ఆ నీరు ఇంకేవరకూ అంటే సుమారు రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ముఖం పూర్తిగా ఆరాక.. చల్లని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే చర్మానికి అవసరమైన పోషణ జరిగి.. చర్మం మృదువుగా మారి మెరుస్తుంది.
బియ్యం కడిగిన నీరు మొటిమల సమస్యకు దివ్య ఔషధం. ఈ నీటిలో కాటన్ ముంచి ముఖం మీద మొటిమలు ఉన్న ప్రదేశంలో ప్రతి రోజు రాస్తే మొటిమల సమస్య తగ్గిపోతుంది. మొటిమల సమస్యే కాకుండా నల్లని మచ్చలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. బియ్యం కడిగిన నీరు మంచి టోనర్‌గా బాగా పని చేస్తుంది. అంతేకాకుండా ఈ నీటి వల్ల చర్మానికి రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. చర్మం మీద ఏర్పడిన ర్యాషెస్,ఎలర్జీలు వంటివి ఉన్నా కూడా తగ్గుతాయి.
అంతేకాకుండా హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ పెట్టి తలస్నానం చేసాక చివరలో బియ్యం కడిగిన నీటిని తలపై పోసి కాసేపు మసాజ్ చేసుకుని నార్మల్ వాటర్‌ను జుట్టుపై పోసుకుంటే.. జుట్టుకు పోషణ అంది జుట్టు రాలే సమస్య తగ్గడబే కాకుండా..జుట్టు కూడా పెరుగుతుంది.ఇలా వారానికి ఒకసారి అయినా చేస్తే జుట్టు ఒత్తుగా పెరగటమే కాకుండా జుట్టుకు కండిషనర్‌గా కూడా పని చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE