ప్రతి ఏడాది కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే జియో, ఈసారి కూడా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రూ.2025’ పేరుతో తీసుకువచ్చిన ఈ స్పెషల్ ఆఫర్, డిసెంబర్ 11, 2024 నుండి జనవరి 11, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు డేటా, కాలింగ్, అదనపు ప్రయోజనాలతో పాటు భారీ ఆదా అందిస్తుంది.
రూ.2025 ప్లాన్ ప్రధాన ఫీచర్లు:
అన్‌లిమిటెడ్ 5జీ డేటా: మొత్తం 200 రోజుల పాటు అపరిమిత 5జీ యాక్సెస్.
500 జీబీ 4జీ డేటా: రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.
అపరిమిత వాయిస్ కాల్స్, SMS: ఇక మీ కమ్యూనికేషన్ బిల్లును ఆలోచించాల్సిన అవసరం లేదు.
రూ.468 ఆదా: నెలవారీ రూ.349 ప్లాన్‌తో పోలిస్తే మీ ఖర్చులు తగ్గుతాయి.
అదనపు లాభాలు: రూ.2150 విలువైన కూపన్లు
ఈ స్పెషల్ ప్యాక్‌తో పాటు అదనంగా మీరు రూ.2150 విలువైన పార్టనర్ కూపన్లను పొందవచ్చు
AJIO కూపన్: రూ.500 డిస్కౌంట్, కనిష్ట కొనుగోలు రూ.2500పై వర్తిస్తుంది.
Swiggy ఆఫర్: రూ.499 ఆర్డర్‌పై రూ.150 డిస్కౌంట్.
EaseMyTrip కూపన్: విమాన టికెట్లపై రూ.1500 తగ్గింపు.
ఎందుకు ఈ ప్లాన్ ప్రత్యేకం?
ఇప్పటి వరకు నెలవారీ రూ.349 ప్లాన్‌ను 200 రోజుల వరకు కొనసాగిస్తే మొత్తం రూ.2,493 ఖర్చవుతుంది. కానీ, న్యూ ఇయర్ ప్లాన్ ద్వారా రూ.2025కే వీటన్నింటినీ పొందవచ్చు. అదనంగా జియో ఇచ్చే కూపన్లతో మీరు మరింత ఆదా చేసుకోవచ్చు.
రీఛార్జ్ ఎలా చేయాలి?
ఈ ప్లాన్ మైజియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్ లేదా ఆథరైజ్డ్ రీటైలర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ, ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ప్లాన్‌ను వినియోగించుకోండి.