వాట్సాప్ లో ఈ ఆప్షన్ తెలుసా?

Do You Know This Option In Whatsapp, This Option In Whatsapp, Do You Know Whatsapp Option, Dont Want To See Your Chat, Know This Option In Whatsapp, Whatsapp, Latest Watsapp Features, Watsapp Features, Watsapp New Update, New Updates In watsapp, Watsaps Chats Latest Feature, Latest Features, Technology, Mango News, Mango News Telugu
Don't want to see your chat,know this option in WhatsApp, WhatsApp

ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో  బయట ఎక్కడైనా ఉన్నప్పుడు వాట్సాప్ లో  చాటింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు.ముఖ్యంగా పర్సనల్ చాట్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న వాళ్లు చూస్తారని భయపడతారు. ఇలాంటి వారి కోసం వాట్సాప్ లో తీసుకొచ్చిన ఓ ఫీచర్ గురించి చాలామందికి తెలియదు. కొన్ని సెట్టింగ్స్ ద్వారా మీ వాట్సాప్‌ను పక్క వాళ్లు చూడకుండా చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

వాట్సాప్‌ను  ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు తెగ ఉపయోగిస్తూనే ఉంటారు. ఒకప్పుడు కేవలం టెక్ట్స్ మెసేజెస్ కోసమే ఉపయోగిస్తుంటే.. ఇప్పుడు వీడియోలు, గ్రూప్ కాల్స్, మనీ ట్రాన్స్‌‌ఫర్ వంటి ఎన్నో వాటికి వాట్సాప్ మీద ఆధారపడుతున్నారు. అందుకే వాట్సాప్ సంస్థ వినియోగదారులను మరింత ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంటుంది.

తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఇప్పుడు ఆఫీసుల్లో చాలా చోట్ల వాట్సాప్ వెబ్ వాడాల్సి వస్తుంది. వాట్సాప్ లో మనం  చాట్ చేస్తున్నప్పుడు కొంతమంది గమనించడం, చూడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే పర్సనల్ చాట్ చూడకూడదని ప్రతి ఒక్కరికీ  ఉంటుంది.. దీని కోసం మీ వాట్సాప్ వెబ్ లో ఒక సెట్టింగ్ ఆన్ చేయాలి.  మీ డెస్క్‌టాప్‌లో ఓపెన్ చాట్‌ను ఎవరూ చూడకూడదనుకుంటే.. మీరు మొదట క్రోమ్ వెబ్ స్టోర్‌కి వెళ్లాలి. ఆ తర్వాత మీరు వాట్సాప్ కోసం WA వెబ్ ప్లస్‌కు వెళ్లాలి. తర్వాత యాడ్ టు క్రోమ్ పై క్లిక్ చేసి తర్వాత, బ్రౌజర్‌ను మూసివేసి, మళ్లీ ఓపెన్ చేయాలి.

ఇప్పుడు మీరు హైడ్, బ్లర్ చాట్‌ల ఆప్షన్ ను పొందుతారు. చాట్‌లను బ్లర్ చేయడంతో పాటు, మీరు ఈ ఆప్షన్ తో అనేక టూల్స్ ఆప్షన్స్ కూడా ఇందులో ఉంటాయి.  అయితే మీరు ఎప్పుడైనా ఈ ఆప్షన్ వద్దు అనుకుంటే.. ఎప్పుడైనా సులభంగా తీసివేయవచ్చు. దీని కోసం మీరు గూగుల్ క్రోమ్ లోని వెబ్ ప్లస్ కు వెళ్లి,, ఆపై టూల్‌బార్ ను క్రోమ్ నుండి తీసివేయి అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =