ఈరోజుల్లో పురుషులతో పోటీ పడుతూ మరీ మహిళలు మద్యం సేవిస్తున్నారు. నిజానికి మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు పదే పదే చెబుతున్నా.. తాగేవాళ్లు ఎక్కువ అవుతున్నారు తప్ప ఎవరూ తగ్గడం లేదు. పని ఒత్తిడి, అనేక టెన్షన్స్‌తో పాటు కుటుంబ సమస్యలను తట్టుకోలేక చాలామంది మద్యం తాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మద్యం తాగడం ఒక కల్చర్ అయిపోయిందనే చెప్పొచ్చు.
మద్యం ఎక్కువగా తాగేవారిలో గుండె ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కాలేయం కూడా పాడవుతుంది. ఇక మహిళలు అయితే సంతాన సమస్యలతో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అయినా కూడా అమ్మాయిలు ఎక్కువగానే మద్యాన్ని సేవిస్తున్నారు. అంతెందుకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆల్కహాల్ సేవిస్తున్నారని కొన్ని అధ్యయనాలు ఇప్పటికే చెబుతున్నాయి. అయితే మన దేశంలో కొన్ని మాత్రం మహిళలు కాస్త ఎక్కువగానే మద్యం సేవిస్తున్నారట.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఉండే మహిళలు ఎక్కువగా మద్యాన్ని సేవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో పురుషులు 53 శాతం మంది మద్యం సేవిస్తే.. మహిళలు 24 శాతం మంది తాగుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో కెల్లా ఇక్కడ మహిళలకే ఎక్కువ మద్యం సేవించే అలవాటు ఉందట. దీని తర్వాత సిక్కిం రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 16.2 శాతం మంది మహిళలకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందట.
ఇక అస్సాం మూడో స్థానంలో ఉండగా.. ఆ రాష్ట్రంలో 7.3 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారు. ఇక నాలుగో స్థానంలో మాత్రం తెలంగాణ ఉంది. ఈ తెలంగాణలో లో 6.7 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారు. ఇక ఐదవ స్థానంలో ఉన్న జార్ఖండ్‌లో 6 శాతం మంది మహిళలు ఆల్కహాల్ తాగుతున్నారు. అండమాన్, నికోబార్ దీవులు ఆరో స్థానంలో ఉండగా..అక్కడ 5 శాతం మంది మహిళలు మద్యాన్ని తాగుతున్నారు. ఏడవ స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉండగా.. ఈ రాష్ట్రంలో 4.9 శాతం మంది ఆల్కహాల్ మద్యం సేవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే మద్యాన్ని ఎక్కువగా తాగే మహిళలకు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళల శారీరక నిర్మాణం వేరేగా ఉండటంతో పాటు.. మహిళల శరీరంలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు స్త్రీలలో ఉండే హార్మోన్లు ఆల్కహాల్‌ను తొందరగా గ్రహించలేకపోవడంతో.. మహిళల శరీరంలో మెటబాలిజమ్ తగ్గిపోయి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.