సెప్టెంబర్ 16 నుంచి అంటే ఈరోజు నుంచి యూపీఐ ప్రెమెంట్స్ లిమిట్సలో మార్పులు వస్తున్నాయి. వ్యక్తులు 5 లక్షల రూపాయల వరకు చెల్లించడానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అంటే యూపీఐని ఉపయోగించొచ్చు. దేశంలోని మిలియన్ల మంది పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. యూపీఐని ఉపయోగించి పన్ను చెల్లింపుల లావాదేవీ పరిమితిని పెంచింది.
ఆగస్ట్ 24, 2024 న వెలుబడిన సర్క్యులర్‌లో, NPCI చెప్పిన దాని ప్రకారం యూపీఐ ప్రాధాన్య చెల్లింపు పద్ధతిగా ఉద్భవించడం వల్ల, నిర్దిష్ట వర్గాల కోసం యూపీఐలో ప్రతి లావాదేవీ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పింది. పైన పేర్కొన్న ప్రతీ లావాదేవీ విలువ పరిమితిని దృష్టిలో ఉంచుకుని యూపీఐలో ఇప్పుడు పన్ను చెల్లింపులకు సమలేఖనం చేయబడిన వర్గాల క్రింద ఉన్న సంస్థలకు 5 లక్షల రూపాయలకు పెంచబడిందని తెలిపింది.
ధృవీకరించబడిన వ్యాపారుల MCC 9311 కేటగిరీకి..ట్రాన్జాక్షన్ లిమిట్‌ని పెంచాలని NPCI బ్యాంకులు, చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐయాప్‌లను కోరింది. పొందుతున్న సంస్థలు MCC 9311లోపు తమ వ్యాపారుల వర్గీకరణ కచ్చితంగా ట్యాక్స్ చెల్లింపులకు మాత్రమే కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. సరైన జాగ్రత్తల తర్వాత ధృవీకరించబడిన వ్యాపారి లిస్టుకు ఎంటీటీలు జోడించబడ్డాయని వారు నిర్ధారిస్తారని NPCI పేర్కొంది.దీని ప్రకారం పెరిగిన పరిమితికి చెల్లింపు మోడ్‌గా యూపీఐ ప్రారంభించబడిందని వ్యాపారులు కన్ఫమ్ చేసుకోవాలి.
ఇప్పటికే ట్యాక్స్ చెల్లింపు లావాదేవీల పరిమితి పెంపుదలకు అనుగుణంగా ఉండేలా చూడాలని NPCI సభ్యులందరినీ.. బ్యాంకులు, చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్‌లను కోరింది. ఈ కొత్త రూల్ ప్రకారం, ఒక వ్యక్తి సెప్టెంబర్ 16, 2024 నుంచి ఒకే లావాదేవీలో రూ. 5 లక్షల వరకు పన్ను చెల్లింపులు చేయడానికి యూపీఐని ఉపయోగించవచ్చు. దీంతో, వ్యక్తులు ఇప్పుడు ఒక్కో లావాదేవీకి 5 లక్షల రూపాయల వరకు యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.
పన్ను చెల్లింపులు, ఆసుపత్రి, విద్యా సంస్థలు, ఐపీఓలు అరండ్ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పథకాల లావాదేవీలు చేయడానికి వ్యాపారి ధృవీకరించబడాలి. దీని ప్రకారం పెరిగిన పరిమితి నిర్దిష్ట పేమెంట్ లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.
అలాగే బ్యాంకులు కూడా వ్యక్తిగత రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితులను నిర్ణయించొచ్చు. కాబట్టి ఒకరోజులో.. యూపీఐ యాప్ ద్వారా ఎంత డబ్బు లావాదేవీలు చేయవచ్చు అనేది బ్యాంక్ తో పాటు ఉపయోగిస్తున్న యూపీఐ యాప్‌పై ఆధారపడి ఉంటుంది.