వెజ్ బిర్యానీ అయినా.. నాన్ వెజ్ బిర్యానీ అయినా బిర్యానీ ఆకు వేస్తే ఆ రుచే రెట్టింపు అవుతుంది. చివరకు మసాలా కూరల్లోనూ ఈ ఆకు వేస్తే ఆ టేస్టే వేరప్పా అన్నట్లు ఫుడ్ లవర్స్ ఎంజాయ్ చేస్తూ ఓ పట్టుపట్టేస్తారు. టేస్ట్ లోనే కాదు.. ఆరోగ్యానికి ఈ బిర్యానీ లీఫ్ ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఆకులతో తయారు చేసిన టీ ఇప్పుడు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని అంటున్నారు.
బిర్యానీ ఆకుల టీ తయారీ విధానం
బిర్యానీ ఆకుల టీ రుచికరంగా ఉండటంతో పాటు మంచి వాసన కలిగి ఉంటుంది. దీనికోసం 2-3 కప్పుల నీరు, 4-5 బిర్యానీ ఆకులు కావాలి. తాజా బిర్యానీ ఆకులు ఉంటే మీరు 3-4 ఆకులను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి దొరకకపోతే ఎండిన బిర్యానీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు. ముందుగా ఒక పాత్రలో నీళ్లు వేసి మరిగించాలి. కాస్త మరిగాక బిర్యానీ ఆకులను వేసి మరో రెండు నిమిషాలు తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఎంతో ఈజీగా తయారుచేసుకునే ఈ టీ ఎంతో రుచిగా ఉంటుంది.
బిర్యానీ టీ, బిర్యానీ ఆకు ఉపయోగాలు
ఈ టీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో రుటిన్, కెఫిక్ ఆమ్లం ఉంటాయి. దీనితో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.
ఈ ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బెణుకులు, కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌తో సహా ఎలాంటి నొప్పినైనా తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం బిర్యానీ ఆకులు క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఫైటోన్యూట్రియెంట్స్ కలిగి ఉంటాయి.
తరచుగా మూత్రపిండాల్లో రాళ్లు ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారికి.. బిర్యానీ ఆకులు శరీరంలో యూరియా స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి బిర్యానీ ఆకుల టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. బిర్యానీ ఆకులు బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడతాయి. దీనిద్వారా జలుబు లేదా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బిర్యానీ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్తో పోరాడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE