రాళ్ల ఉప్పుతో స్నానంపై నిపుణులు ఏం అంటున్నారు?

What Do Experts Say About Rock Salt Baths?, Experts About Rock Salt Baths, Salt Bath, Salt Water Bath, Salt Water, Is It Good To Take Salt Water Bath?, Salt In The Water, Rock Salt Baths?, Salt, Uses Of Salt Water Bath, Advanteges Of Salt Water, Bathing Salt Water, Health News, Health Tips, Healthy Diet, Mango News, Mango News Telugu
Salt Water Bath,Salt Water,Is it good to take Salt Water Bath?, salt in the water, rock salt baths?

స్నానం చేస్తే శరీరం శుభ్రపడటమే కాదు.. మైండ్ అండ్ బాడీ రిలాక్స్ అవుతుంది. అయితే స్నానం చేసేటప్పుడు ఆ వేడి నీళ్లలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసుకుని  స్నానం చేస్తే  ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు. ఇది ఇప్పుడు కనిపెట్టింది కాదని పురాతనంగా ఉన్న అద్భుతమైన సాంకేతికత అని అంటున్నారు. నిజానికి రాళ్ల ఉప్పులో ఉండే మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి మినరల్స్ ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయని చెబుతున్నారు.

ఉదయాన్నే రాళ్ల ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల ఆ రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. రాళ్ల ఉప్పు శాస్త్రీయ నామం మెగ్నీషియం సల్ఫేట్. అంటే ఇది మెగ్నీషియం-సల్ఫర్‌తో తయారు చేయబడింది అని అర్ధం. ఈ సాల్ట్‌ను ఎప్సమ్ సాల్ట్, సముద్రపు ఉప్పు అని కూడా అంటారు. ఈ ఉప్పు నీటిలో చాలా తేలికగా కరిగి..ఆ నీటిలో విడుదల చేసే సల్ఫేట్, మెగ్నీషియం, ఐరన్‌ వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి. గోరు వెచ్చని నీటిలో  సముద్రపు ఉప్పు కలిపి తలకు స్నానం చేయడం వల్ల  శిరోజాలలో  మెరుపు వస్తుంది. అంతేకాకుండా చర్మంలోని మురికి చాలా వరకూ తొలగిపోతుంది. ముఖ్యంగా శరీరంపై మృతకణాలు పూర్తిగా తొలిగిపోయి ముఖంపై మెరుపు వస్తుంది. అలాగే వేసవి కాలంలో చెమట పట్టడం వల్ల వచ్చే తామర, గజ్జి, దురద వంటి చర్మ ఇన్ఫెక్షన్ల సమస్యలను ఈ రాళ్ల ఉప్పు స్నానం దూరం చేస్తుంది.

అలాగే రోజూ ఎక్సర్‌సైజులు చేస్తూ  రన్నింగ్ చేసేవాళ్లకు..బాడీ పెయిన్స్ ఉంటే  వేడి నీళ్లలో ఒక చెంచా రాళ్ల ఉప్పు వేసి స్నానం చేస్తే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి నుంచి కూడా రాళ్ల ఉప్పుతో స్నానం వల్లల ఉపశమనం లభిస్తుంది. వేడి నీళ్లలో ప్రతీ రోజూ రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వాపులు కూడా తగ్గిపోతాయి. ఉప్పునీళ్లు రోగనిరోధక శక్తిని పెంచే సాధనంగా కూడా పనిచేస్తుంది. ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. ఉప్పు నీళ్లలో శరీరాన్ని బలపరిచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రాళ్లు ఉప్పు వేసిన నీటిలో ఉండే యాంటీ బాక్టీరియా.. ప్రమాదకరమైన సూక్ష్మజీవులను తొలగించడంలో బాగా సహాయపడతాయి. అంతేకాదు ఈ నీటితో స్నానం చేయడం వల్ల శరీరం కూడా ఫిట్‌గా ఉంటుంది.

రాళ్ల ఉప్పు  వేసిన నీటితో స్నానం చేయడం వల్ల అలసట, ఒత్తిడి వంటివి తొలగిపోతాయి. ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు ఉప్పునీరు ఒత్తిడిని తగ్గించే విధంగా పనిచేస్తుంది. ఈ నీటితో స్నానం చేయడం వల్ల హృదయానికి, మనసుకు  ఎంతో ప్రశాంతత కలగడంతో.. రోజంతా అలసట నుంచి రిలీఫ్ పొందవచ్చు. బాత్‌టబ్‌ను వేడి నీటితో నింపి, దానిలో రెండు కప్పుల ఎప్సమ్ సాల్ట్ వేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచేయాలి. తరువాత ఆ నీటిలో పావుగంట కూర్చుంటే శరీరానికి కావల్సిన అన్ని ప్రయోజనాలు దొరుకుతాయి. ఇది రిలాక్షేషన్ అండ్ చర్మ సమస్యలకు చికిత్సగానే పనికొస్తుంది. అంతే కాకుండా మనిషిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడంలో రాళ్ల ఉప్పు స్నానం మంచిదని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE