వేసవిలో సూర్యకాంతితో పాటు, కాలుష్యం, అధిక చెమట వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఎండ ప్రభావంతో చర్మం నీరసంగా, నల్లగా మారుతుంది. అలాగే ఎండాకాలంలో మొటిమలు , చమట కాయలు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఐస్ డిప్ థెరపీ అనేది బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెరిసే చర్మానికి, మచ్చలు లేని స్కిన్ కోసం.. ఐస్ డిప్ చికిత్స చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఐస్ డిప్ పద్దతిని ఎక్కువగా కొరియన్ మహిళలు, బాలీవుడ్ తారలు ఉపయోగిస్తారు. ఐస్ డిప్ మెథడ్.. జిడ్డు చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. ఓపెన్ రంధ్రాల సమస్య నుంచి ఇది బాగా ఉపశమనం అందిస్తుంది.
ఐస్ డిప్ థెరపీ కోసం ముందుగా ఒక పెద్ద పాత్రలో ఐస్ క్యూబ్‌లను తీసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్‌కు సరిపడా నీటిని పోసుకోవాలి. ఇప్పుడు ఐస్ ఉన్న నీటిలో ముఖాన్ని ముంచాలి. కొద్దిసేపు ముఖాన్ని ఆ చల్లటి నీటిలో ముంచి తర్వాత బయటకు తీయాలి. మళ్లీ కొంత సమయం తర్వాత మరోసారి కూడా కూడా ప్రక్రియ కొనసాగించాలి.
ఐస్ డిప్ ట్రీట్‌మెంట్ తరచూ చేయడం వల్ల ముఖం, కళ్ల చుట్టూ ఉన్న వాపును తగ్గిస్తుంది.అలాగే మీ ముఖాన్ని తరచూ ఐస్ వాటర్‌లో ముంచడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ పెరిగి.. ముఖానికి మెరుపును తెస్తుంది. ఐస్ డిప్ ముఖంపై ఉన్న ఫైన్ లైన్లను కూడా తగ్గిస్తుంది. దీంతో చర్మం ముడతలు తగ్గుతాయి. ఐస్ డిప్ మొటిమల సమస్యల నుంచి, చమటకాయల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఐస్ డిప్ వల్ల చర్మ రంధ్రాలను బిగుతుగా అయి ఫేస్ లోని చర్మం సాగిపోకుండా టైట్ గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుందని బ్యూటిషీయన్లు చెబుతున్నారు. అంతేకాదు చర్మం నునుపుగా మారుతుందని, మురికి, నూనె పేరుకుపోవడం వంటి సమస్యలకు దూరంగా ఉంచుతుంది. అలాగే డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ ఐస్ క్యూబ్ వాటర్‌ను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.