సీవీలో అబద్ధాల రేటు పెరిగింది..సర్వేలో షాకింగ్ విషయాలు

The Rate of Lying in CV Has Increased Shocking Things in the Survey,the Rate of Lying in CV,Lying in CV Has Increased,Shocking Things in the Survey,Rate of Lying in CV Survey,Mango News,Mango News Telugu,Resume Lab Survey,Lying in CV for Job, the Rate of Lying in CV, Survey,Job, Employees,Lying in CV Latest News,Lying in CV Latest Updates,Lying in CV Live News
Resume Lab survey,Lying in CV for job, The rate of lying in CV, survey,job, Employees,

ఒకప్పుడు వెయ్యి అబద్దాలు చెప్పయినా  ఒక పెళ్లి చేయాలి అనే వారు పెద్దలు. కానీ ఇప్పుడు వంద అబద్దాలు చెప్పయినా ఒక ఉద్యోగం సంపాదించాని  అనుకుంటున్నారు ఉద్యోగార్ధులు. రెజ్యూమే లేదా సీవీ అనేది ఉద్యోగానికి చేయడానికి ముందు చేసుకున్న ఓ దరఖాస్తు లాంటిది. అయితే ఇందులోనే  పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో పాటు..వారి  అనుభవానికి సంబంధించిన వివరాలన్నిటినీ అందులో చూపిస్తారు. అయితే ఈ  మధ్య కాలంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు.. తప్పుడు సమాచారాన్ని ఎంటర్ చేస్తున్నారని తేలింది. ఇలా తమ వివరాలు తప్పు అని తేలడంతో..  42శాతం మందిని ఇంటర్వూల సమయంలోనే  గుర్తించి తిరస్కరించారట.

నిజానికి రెజ్యూమేలో , ఇంటర్వూలలో నిజాయితీగా ఉండాలి. అదే వాళ్ల  కెరీర్‌కి  దోహదపడుతుంది. ఇంటర్వూకి వచ్చిన వ్యక్తి స్కిల్‌తో పాటూ ప్రవర్తనపైనా ఒక్కో సారి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ తమ సీవీలలో అబద్దాలతో కూడిన అనుభవాలు, ప్రమోషన్లు, జీతాలను నమోదు చేస్తున్నట్లు.. రెజ్యూమ్ ల్యాబ్ సర్వేలో తేలింది.

దాదాపు 1914 మందిపై ఒక సర్వే నిర్వహించగా.. అందులో 52శాతం మంది తప్పుడు అనుభవాలతోనే సీవీని  అందించారని ఒక అధ్యయనం తెలిపింది. 27% మంది ఒకటి లేదా రెండు అబద్దాలు చెప్పేవారయితే.. 71% మంది పూర్తి స్థాయిలో అబద్ధాలు చెప్పేవారుగా అధ్యయనం చెప్పింది. అయితే ఇందులో 37% మంది తాము అబద్దాలు చెప్పినట్లు అంగీకరించారు. ఈ సంవత్సరం ఆగస్టులో రెజ్యూమ్‌పై అబద్ధాల రేట్లు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది.బ్యాచిలర్ డిగ్రీ పట్టా ఉన్నవాళ్లు 49% మంది అబద్దాలు చెబుతుంటే.. డిగ్రీ పట్టా లేని వాళ్లు 73% మంది తప్పుడు వివరాలను సమర్పిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీరందరి కంటే కూడా 80% మంది కార్మికులు.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అబద్ధాలు చెబుతున్నట్లు నివేదిక తెలిపింది.

నిజమే ఉద్యోగం కావాలనుకునేవాళ్లు.. తమ అవసరాల కోసం వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకోవాలని అనుకుంటారు. అయితే ఈ సందర్భంగా లేని స్కిల్స్ ఉన్నట్లు చూపించడం..చదవని చదువును చదివినట్లు రాయడం.. లేని అనుభవాన్ని ఉన్నట్లు పొందుపర్చడం చేస్తున్నారని.. దీనివల్ల వారి  భవిష్యత్తుపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇలా చేసి పట్టుబడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని..  ఒక్కోసారి కేసులతో పాటూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే రెజ్యూమేలలో,  ఇంటర్వ్యూలలో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని సూచిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =