జీవక్రియ సరిగా ఉండాలన్నా, శరీరంలో అన్ని భాగాలకు కూడా ఆక్సిజన్ మెరుగ్గా లభించాలన్నా మంచినీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే రాత్రి పడుకునే ముందు కొంతమంది నీళ్లు తాగి పడుకుంటారు. నిజానికి పడుకునే ముందు ఇలా నీటిని తాగిగే మంచిదేనట.
దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇలా నీళ్లు తాగితే.. శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలో ఇవి ఉపయోగపడుతాయి. రాత్రి నీరు తాగి పడుకుంటే ఉదయం మూత్రం రూపంలో విష పదార్థాలన్నీ బయటకు వెళ్తాయి. అదే విధంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో కూడా మంచినీళ్లు తాగి పడుకోవడం అనే అలవాటు ఉపయోగపడుతుంది.
రాత్రి తగినంత నీటిని తీసుకోవడం వల్ల మనలోని ఒత్తిడి, ఆందోళన దూరమవుతుందట. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే వాళ్లుల.. రాత్రి పడుకునే ముందు మంచి నీరు తాగి పడుకుంటే.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కాకపోతే రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల.. శరీరానికి సహజమైన క్లెన్సర్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మ రసం కలుపుకొని తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే రాత్రుళ్లు పడుకునే ముందు నీటిని తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో..నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రాత్రి నీళ్లు తాగడం వల్ల మధ్యలో మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది కాబట్టి.. దీనివల్ల నిద్రకు భంగం కలిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
దీని వల్ల నిద్రలేమి సమస్య వచ్చి..ఇదే కొనసాగితే గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. నిద్రపోయే కంటే కనీసం గంట ముందు నుంచి నీటిని తాగకూడదని నిపుణులు అంటున్నారు. అయితే శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవుతుందని అనుకుంటే మాత్రం ఒక చిన్న గ్లాసు నీటిని తీసుకోవాలి.