నిద్రపోని మహానగరంగా.. అడుగులు వేస్తోన్న హైదరాబాద్

Hyderabad Steps into The City That Never Sleeps,Hyderabad City That Never Sleeps,Hyderabad Steps into Never Sleeps City,Mango News,Mango News Telugu,All the noise making Hyderabad a sleepless city,Indias city that never sleeps,The City Never Sleeps,A city that never sleeps,The sound standard,Hyderabad steps into the city that never sleeps,Transformation of social life style, Hyderabad is the city that never sleeps,Hyderabad City Latest News,Hyderabad City Latest Updates,Hyderabad City Live News,Telangana Latest News And Updates,Hyderabad News

కాలు బయట పెడితే అడుగడుగునా ఆకాశాన్నంటే బిల్డింగులు, దానితో పోటీ పడుతూ గాలిలో వేలాడే స్కైవేలు.. అసలు ఇది హైదరాబాదేనా అన్న అనుమానాలను కలిగిస్తుంది. దీనికి తోడు పోష్ కల్చర్‌తో అబివృద్ధిలో దూసుకుపోతూనే రాకెట్ వేగంతో మార్చుకుంటున్న లైఫ్ స్టైల్ వెరసి భాగ్యనగరాన్ని ఎక్కడికో తీసుకువెళుతున్నాయి. మారుతోన్న మనుష్యుల జీవనశైలి, రోజురోజుకు డెవలప్ అవుతున్న లివింగ్ కల్చర్, పక్క రాష్ట్రాల సంప్రదాయాలను కూడా కలుపుకొనిపోయే వేగవంతమైన మార్పులు హైదరాబాద్‌ను మరో జాబితాలో చేర్చేందుకు రెడీ అవుతున్నాయి. నిద్రపోని మహానగరం (Hyderabad is the city that never sleeps) లిస్టులో భాగ్యనగరాన్ని చేర్చడానికి వడివడిగా అడుగులు వేసేలా చేస్తున్నాయి.

సోషల్ లైఫ్ స్టైల్‌ ట్రాన్స్ఫార్మేషన్ (Transformation of social life style) వల్ల ఇలా హైదరాబాద్ కూడా తయారవుతోందన్న వాదనలోనూ నిజం లేకపోలేదు. ఒకప్పుడు రాత్రి 10 అయితే నిర్మానుష్యంగా ఉండే రోడ్లు.. ఇప్పుడ తెల్లవారు జామున 3, 4 కు వెళ్లినా అదే వాహనాల సందడి కనిపిస్తోంది. నంబర్ తగ్గొచ్చేమో కానీ హైదరాబాద్‌లో మాత్రం జనసంచారం లేని రోడ్లే కనిపించవు అంటే మాత్రం అది అతి శయోక్తి కూడా కాదు. అందుకే రాత్రులు వాహనాల మోత ఉండదు కాబట్టి శబ్ద తీవ్రత (Noise intensity) తక్కువ అనే మాటలకు కాలం చెల్లిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే పగలుతో రాత్రి పోటీ పడుతుందా అన్నట్లు కనిపిస్తున్న వాహనాలు గోల.. ఈ మాటలను ఎప్పుడో కాలగర్భంలో కలిపేశాయి.

అంతెందుకు ఒకప్పుడు రాత్రి 11 గంటలు దాటిందంటే.. ఆకలి ఆకలి అంటూ ఆత్మారాముడు గగ్గోలు పెట్టినా పట్టించుకునే నాధుడే ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు 24 బై 7 తినడానికి రోడ్ సైడ్ ఫుడ్ అందుబాటులోనే ఉంటుంది. కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ వారు ప్రత్యేకించి దీనికోసం సిబ్బందిని కూడా నియమించుకున్నారంటేనే నైట్ ఫుడ్ కల్చర్ కు హైదరాబాద్ ఎంతగా అలవాటు పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు.. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయిలకు పగలు కంటే రాత్రులే చేతినిండా పని దొరుకుతుందట. అటు ఓలా , ఉబర్ వంటి క్యాబ్ డ్రైవర్స్ కూడా కేవలం రాత్రి పూట రైడ్స్ కోసమే వెయిట్ చేస్తుంటారు. సర్జ్ చార్జ్ లతో పాటు రాత్రయితే పగలు కంటే కూల్ జర్నీ ఉంటుందంటూ నైట్ రైడ్స్ కే ఓటేస్తున్నారు. అలా మారుతున్న జీవనశైలి వల్ల.. ఉద్యోగాలు పెరిగాయి.. ఉద్యోగస్తులు పెరిగారు. దీంతో రాత్రులు నిద్రపోనివారితో నగరం మరింత బిజీబిజీగా మారిపోతోంది. దీంతో రాత్రులు కూడా శబ్ద తీవ్రత స్థాయిల (Noise intensity levels)ను కనుగొన్నట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) రిపోర్టు రీసెంట్‌గా తెలిపింది.

TSPCB చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువక శబ్ద స్థాయిలు (Noise intensity levels) నమోదవుతున్నాయట. జూబ్లీహిల్స్‌‌లో అత్యధికంగా 72.53 డెసిబుల్స్‌ నమోదవుతున్నప్రాంతంగా నిలిచింది. ఈ ఏరియాలో చాలా రెస్టారెంట్లు, పబ్‌లు, హోటల్స్, ఫ్యాషన్‌ స్టోర్స్‌, రిక్రియేషన్‌ సెంటర్లతో యూత్‌ను అన్ని విధాల ఆకట్టుకునే ఎన్నో అట్రాక్షన్స్ ఉండటమే దీనికి కారణమని TSPCB చెప్పింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య చూసుకుంటే.. 45 డిసిబుల్స్‌ శబ్ద ప్రమాణాన్ని (The sound standard) కలిగి ఉండాలని, కానీ దీనికి ఎలాంటి సంబంధం లేనంత స్థాయిలో ఇవి నమోదవుతున్నట్లు గుర్తించింది. దీంతో నిద్ర పోని మహానగరంగా మారే జాబితాలో అతి త్వరలోనే హైదరాబాద్ పేరు వినిపించనుందన్న వాదన వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 8 =