ఒకప్పుడు ఎవరింట్లో చూసినా చద్దన్నం మాత్రమే తినేవాళ్లు. రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు కానీ మజ్జిగ పోసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే దానిలో కొంచెం పెరుగు వేసుకుని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంజుకుని తినేవాళ్లు. అందుకే అప్పుడు ఎంత పని అయినా ఈజీగా చేసేవారు, సాయంత్రం వరకూ ఉత్సాహంగా ఉండేవారు కానీ ఇప్పుడు పల్లెటూళ్లలోనూ సిటీ పోకడలు ఎంటర్ అయి.. అక్కడ కూడా టిఫిన్ కల్చర్ వచ్చేసింది. చద్దన్నంలో వైరస్‌కు చెక్ పెట్టగలిగేటంత రోగనిరోధక శక్తి ఉంటుందని నిపుణులు కూడా సూచించడంతో ఇప్పుడు ఆన్‌లైన్ ఆర్డర్స్‌లో కూడా చద్దన్నం చేరిపోయింది. అందులోనూ సమ్మర్‌లో చద్దన్నం తింటే చాలామంచిదని పెద్దలు చెబుతున్నారు.
భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ చద్దన్నానికి బాగా డిమాండ్ వచ్చింది. అమెరికాలో అయితే ఈ చద్దన్నాన్ని రూ.వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నారట. తాజాగా ఓ భారతీయురాలు అమెరికాలో ఓ స్టోర్‌లో అమ్ముతున్న చద్దన్నం వీడియో తీసి మరీ పోస్ట్ చేయడంతో అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొద్ది మంది ఇప్పటికీ చద్దన్నమా అని ముఖం చిట్లించినవారంతా.. అమెరికాలో చద్దన్నానికి ఉన్న క్రేజ్ చూసి తెగ షాక్ అవుతున్నారు.
చద్దన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా అన్నం నీళ్లు,లేదా మజ్జిగతో సహా పులవడం వల్ల దానిలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. ఒకవేళ 50 గ్రాముల అన్నాన్ని రాత్రి పులియబెట్టామనుకుంటే.. అందులో 1.6 మిల్లీగ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములకు చేరుతుంది. అలాగే పొటాషియం, కాల్షియంలు కూడా బాగా పెరుగుతాయి. ఇవన్నీ మనిషి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయని,అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వాళ్లు రోజూ చద్దన్నం తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.ఎక్కువ సమయం ఉత్సాహంగా పనిచేయడానికి చద్దన్నం ఉపయోగపడుతుంది. చర్మవ్యాధుల నుంచి కూడా చద్దన్నం కాపాడుతుంది.పేగుల్లో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చద్దన్నం నెంబర్ వన్.
కడుపులో మేలు చేసే బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తుంది. నీరసం తగ్గుతుంది మలబద్దక సమస్య ఉండదు. బీపీ కూడా అదుపులో ఉంటుంది.
యాంగ్సైటీ తగ్గుతుంది. అలాగే చద్దన్నంలో బీ12, బీ 6 విటమిన్లు, పీచు అధికంగా లభిస్తుంది. చద్దన్నంలో ఉండే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు.. రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మన శరీరంలో ఉండే హానికర వైరస్‌లను చంపుతుంది.