తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు సీఎం కుర్చీ కోసం పోటీ పడినా కూడా రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. రాహుల్ గాంధీకి, సోనియాగాంధీకి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఉండటంతోనే ఇది సాధ్యమయిందని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డికి కాస్త గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తున్నా.. మరి కొన్ని సందర్భాల్లో మాత్రం పాలు, పంచదార లాగే ఉంటారన్న టాక్ ఉంది. మరోపార్టీపై రేవంత్ రెడ్డి ఒకరకంగా పూర్తిస్థాయిలో పట్టు సాధించినా కూడా..కొన్ని శాఖల మీద పట్టు , ఇద్దరు ముగ్గురు మంత్రుల మీద పెత్తనం చేయలేకోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఇది ఒకరకంగా ప్రభుత్వానికి ఇది ఇబ్బంది కలిగిస్తున్నా.. అధిష్టానం ఒత్తిడి వల్లే ఇదంతా జరుగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి .
మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి ఏడాది పూర్తయి..విజయవంతంగా రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. పథకాల విషయంలో కొన్ని అమలు చేస్తున్నా కూడా.. మిగతా వాటికి సంబంధించి అమలు అంతంతమాత్రమే జరుగుతోందన్న ప్రచారం జరిగింది. కాగా రేవంత్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారని..ఇప్పుడు అమలు చేయడంలో విఫలమవుతుందని ఆరోపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదేళ్లు పరిపాలన సాగించలేరని సొంత పార్టీ నేతలతో పాటు.. బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు.
దీంతో ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో.. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని.. తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చానని.. నేరుగా ముఖ్యమంత్రి అయ్యానని.. చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేశానని అన్నారు. ఇంకా నాలుగేళ్ల పాటు పరిపాలన సాగించాల్సి ఉందన్న సీఎం.. వచ్చే టర్మ్ కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు
అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న తెలంగాణ రాజకీయాలలో వ్యక్తమౌతోంది. రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నా కూడా.. ప్రభుత్వపరంగా కూడా లోటుపాట్లు కనిపిస్తున్నా.. రెండోసారి కూడా సీఎం తానే అవుతానని ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
అయితే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలం కోల్పోయిందని..కానీ కాంగ్రెస్ పార్టీ బలాన్ని అలాగే ఉంచుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని..దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని.. అందుకే రేవంత్ రెడ్డి ఆ తరహా వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిని కూడా పోటీలో దించలేదు. అందుకే రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని వ్యాఖ్యాని స్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి.. తన నాయకత్వాన్ని రుజువు చేసి..ఇదే అంశాలను అధిష్టానం ముందు చూపించి మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని రేవంత్ రెడ్డి వ్యూహమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.






































![తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి నియామకంపై సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు Supreme Court Collegium Recommended Judge Justice Ujjal Bhuyan as Telangana High Court Chief Justice, Judge Justice Ujjal Bhuyan as Telangana High Court Chief Justice, Supreme Court Collegium Recommended Judge Justice Ujjal Bhuyan as TS HC Chief Justice, TS HC Chief Justice, Judge Justice Ujjal Bhuyan, Supreme Court Collegium, ]Judge Justice Ujjal Bhuyan as TS HC, Telangana High Court Chief Justice, Supreme Court Collegium Recommended Ujjal Bhuyan as Telangana High Court Chief Justice, Judge Justice, Telangana High Court CJ, TS HC New CJ, Justice Ujjal Bhuyan to be the new Chief Justice of Telangana, TS HC New CJ News, TS HC New CJ Latest News, TS HC New CJ Latest Updates, TS HC New CJ Live Updates, Mango News, Mango News Telugu,](https://telugu.themangonews.com/wp-content/uploads/2022/05/image-7-11-100x70.jpg)