ఆయుర్వేదంలో ఏబీసీ జ్యూస్ ను సర్వరోగ నివారిణి అంటారు. యాపిల్, బీట్ రూట్,క్యారెట్ .. ఈ మూడింటిని మిక్స్ చేసి చేసిందే ఏబీసీ జ్యూస్. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిని ఈజీగా తయారు చేసుకోవచ్చు.
ఏబీసీ జ్యూస్ కోసం కావలసిన పదార్దాలు:
యాపిల్ 1, బీట్ రూట్ – 1,క్యారెట్ – 2, మింట్ లీవ్స్ – కొన్ని, హనీ – 2 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ – టేబుల్ స్పూన్, నీరు – 3 కప్పులు
ఏబీసీ జ్యూస్ తయారీ విధానం:
ముందుగా యాపిల్, బీట్ రూట్, క్యారెట్ లను ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ వేసుకోవాలి. తర్వాత మింట్ లీవ్స్, హనీ, లెమన్ జ్యూస్ పోసుకున్నాక మరోసారి మిక్సీ వేసుకోవాలి. కావాలనుకున్నవాళ్లు కొద్దిగా నీళ్లు కలిపితే మంచిది.
ఏబీసీ జ్యూస్ వల్ల ఉపయోగాలు:
ఏబీసీ జ్యూస్ ను ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఫ్రెష్ గా తాగితే మంచిది. అయితే అలా వీలు లేనివాళ్లు గుడ్డి కంటే మెల్ల మంచిదే అన్నట్లు 2,3 రోజులకు సరిపడా జ్యూస్ ను తయారు చేసుకుని ప్రిడ్జిలో పెట్టుకుని తాగొచ్చు. ఏది ఏమయినా తాజా జ్యూస్ లు ఇచ్చిన ఫలితాలు నిల్వ ఉంచిన జ్యూస్ ఇవ్వవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఏబీసీ జ్యూస్ గుండెకి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వాడిన యాపిల్, బీట్ రూట్, క్యారెట్ ఈ మూడు పదార్ధాలు గుండెకి కవచం లాగా పనిచేస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో మినరల్స్, విటమిన్లు ఉంటాయి. ఈ జ్యూస్ రెడ్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల మచ్చలు లేని చర్మం లభిస్తుంది. ఇది కళ్లకి చాలా మంచిది. ఇది ఇమ్యూన్ సిస్టంని అభివృద్ధి చేస్తుంది. దీన్ని బరువు తగ్గాలి అని అనుకునే వారికి ఒక వరంగా చెబుతారు.
ఏబీసీ జ్యూస్ ను వెయిట్ లాస్ డైట్ లో దీన్ని భాగం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీనిలో లో కేలరీ,హై ఫైబర్ ఉంటుంది. చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. తిన్నది అరగకపోవటం,వాంతులు కావడం,మల బద్ధకం,ఇలాంటి వాటితో ఇబ్బంది పడేవారికి ఈ జ్యూస్ చాలా మంచిది. ఈ జ్యూస్ ఉదయం పరగడుపున తీసుకుంటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలో తేలింది.