ఆలివ్ ఆయిల్ సరే.. ఆలివ్ ఉప్పు కూడా ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఆలివ్ ఉప్పు ఒక అద్భుత ఔషధం అని..గుండె జబ్బుల వంటి వాటి నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. అన్ని పొట్ట సమస్యల నుంచి ఉపశమనం దొరికేలా కూడా చేస్తుందట. శరీరానికి బలాన్ని అందించడానికి ఆలివ్ ఉప్పు ఉపయోగపడుతుంది.
ఆలివ్ ఉప్పు కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన సమస్యలను త్వరగా కంట్రోల్ చేస్తుందట. కడుపులో సంభవించే అన్ని సమస్యలను, జీర్ణ సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది. ఈ ఉప్పు డయాబెటిక్ రోగులకు కూడా చాలా ఉపయోగకరమే కాకుండా.. బరువును కూడా నియంత్రించవచ్చట. అలాగే ఆలివ్ ఉప్పును ఉపయోగించడం వల్ల శరీరంలో ఏ రకమైన వాపునైనా సులభంగా తగ్గుతుందట.
అయితే ఆలివ్ ఉప్పును నేరుగా వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని సలాడ్‌లు, కూరగాయలలో కలిపి తినొచ్చు. మంచిదే కదా అని ఎక్కువగా ఆలివ్ ఉప్పును ఎక్కువ వాడితే మంచిది కాదని అంటున్నారు.కాకపోతే ఇది చాలా ఖరీదయిన ఉప్పు. వందగ్రాముల ఆలివ్ ఉప్పు సుమారు 6వందల రూపాయలు ఉంటుంది. డాక్టర్ల సలహా మేరకు వాడితే మంచిది
ఆలివ్ ఉప్పులో ఉండే విటమిన్స్..
విటమిన్ ఇ: ఇది యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం, ఇది హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది
ఐరన్: బ్లాక్ ఆలివ్‌లు ఇనుము యొక్క గొప్ప మూలం, ఇది ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి ముఖ్యమైనది
రాగి: ఈ ముఖ్యమైన ఖనిజం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
కాల్షియం: ఇది ఎముక, కండరాలు మరియు నరాల పనితీరుకు అవసరం
సోడియం: చాలా ఆలివ్‌లు ఉప్పునీరు లేదా ఉప్పునీటిలో ప్యాక్ చేయబడినందున అధిక మొత్తంలో సోడియం కలిగి ఉంటాయి