రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేస్తే అంతే సంగతులట

Health Issues Associated With Eating Dinner Late At Night

పని ఒత్తిడి, బిజీ లైఫ్‌ వల్ల ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. వేళకాని వేళల్లో నిద్రపోవడం, ఎప్పుడుపడితే అప్పుడు తినడం వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఈ రెండే వారి జీవితాన్ని తలకిందులు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. = మంచి ఆహారం తినడం మాత్రమే కాదు.. సరైన సమయంలో తినడం కూడా చాలా ముఖ్యం.

మారుతున్న జీవనశైలి, పని ఒత్తిళ్ల వల్ల, చాలా మంది ఒకే సమయానికి భోజనం చేయలేకపోతున్నారు. ఉదయం పూట ఎలా ఉన్నా..కనీసం రాత్రి భోజనానికి మాత్రం ఒక సమయాన్ని నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.అది కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య తినడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని దీనివల్ల.. హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. వీటన్నింటికీ తోడు, భోజనం తర్వాత కనీసం 2 నుంచి 3 గంటలు విరామం ఉండాలని..అప్పుడు తింటే త్వరగా జీర్ణం అయి నిద్రపోయే సమయానికి అరిగిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు ఈ సమయంలో తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే సుఖవంతమైన నిద్ర వస్తుంది.

అదే కనుక లేటుగా భోజనం ఆలస్యం చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఆలస్యంగా తినడం వల్ల శరీరం కేలరీలు బర్న్ అవ్వకుండా ఫ్యాట్ గా స్టోర్ అయిపోతుంది. దీంతో బాడీలో కొవ్వు పేరుకుపోవడం ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ రావడం, బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . అంతేకాకుండా లేటుగా తిని పడుకోవడం వల్ల నిద్ర పట్టదని.. సరైన నిద్రలేకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని అంటున్నారు.