బి-12 విటమిన్ కావాలా అయితే ఇవి తినాల్సిందే..

బాడీలో యాక్టివ్ నెస్ లేకపోవటం, బద్దకంగా ఉన్నట్లు అనిపిస్తే దానికి బి-12 లోపం కారణమని నిపుణులు చెబుతున్నారు. మనిషిలో చురుకుదనం పెంచేందుకు విటమిన్ బి-12 పోషకాన్ని శరీరానికి అందించాలంటున్నారు. ఇది సహజంగా మొక్కలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు వంటి ఆహారపదార్ధాల్లో లభిస్తుందని వివరిస్తున్నారు.

చేపలు -చేపల్లో విటమిన్ బి-12 అధికంగా లభిస్తుంది. ట్యూనా, సాల్మన్, సార్డినెస్ , ట్రౌట్ వంటి వివిధ రకాల చేపలను ఆహారంగా తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన బి -12 విటమిన్ అందుతుంది. యూస్ అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ అందించిన సమాచారం ప్రకారం 150 గ్రాముల సార్డినెస్ లో 554శాతం విటమిన్ బి- 12 లభిస్తుంది. సాల్మన్ రకం చేపలో కూడా అధిక మొత్తంలో ప్రొటీన్ లు లభిస్తాయి.

చికెన్ -చికెన్ లో ఎక్కవ ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. బి -12 శరీరానికి సమకూరాలంటే అప్పుడప్పుడు చికెన్ ను తీసుకోవటం మంచిది.

గుడ్లు-ప్రొటీన్లు, విటమిన్ లు పుష్కలంగా లభించే ఆహారం ఏమైనా ఉందంటే అది గుడ్డు అనే చెప్పాలి. ప్రతిరోజు రెండు ఉడికించిన గుడ్లు తినటం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ బి- 12 ను అందిస్తాయి.

న్యూట్రిషియన్ ఈస్ట్ ఫ్లేక్స్ -శాకాహారులకు న్యూట్రిషియన్ ఈస్ట్ ప్లేక్స్ మంచి ఆహారంగా చెప్పొచ్చు. ఇది ఆహారంలో కలపటం వల్ల మంచి రుచివస్తుంది. యూఎస్ డిఎ అంచనా ప్రకారం రెండు టేబుల్ స్పూన్ల న్యూట్రిషియన్ ఈస్ట్ లో 73.3శాతం వరకు విటమిన్ బి- 12 లభిస్తుందట.

పాలు-పాల ద్వారా విటమిన్ బి- 12 లభిస్తుంది. అందుకే బి -12 లోపాన్ని నివారించటానికి ప్రతిరోజు పాలు తాగమని డాక్టర్లు చెబుతారు. పాలు తాగటం వల్ల అదనంగా కాల్సియంతోపాటు, విటమిన్ డి కూడా లభిస్తాయి. శాకాహారులు సోయా పాలతో బి -12 లోపాన్ని భర్తీ చేయవచ్చు.
పెరుగు-పెరుగులో సైతం విటమిన్ బి- 12 అధికంగా ఉంటుంది. కాల్షియంతోపాటు, విటమిన్ డి, ఇతర ప్రోబయోటిక్స్ ఇందులో సమృద్ధిగా దొరుకుతాయి.

చిరుధాన్యాలు,తృణధాన్యాలు-అత్యంత బలవర్ధకమైన ఆహారంగా చిరు,తృణ ధాన్యాలను చెప్పొచ్చు. శరీరానికి కావల్సిన అన్ని విటమిన్లు, ప్రొటీన్లు ఇందులో లభిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవటం ద్వారా బి-12 విటమిన్ లభిస్తుంది.