ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్సత్తి తగ్గుతుండటంతో.. చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే భారత దేశం ప్రస్తుతం మంచి స్థితిలోనే ఉన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు చెబుతూ కొత్త సర్వేలు పెద్ద షాక్ ఇచ్చాయి.
అవును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫర్టిలిటీ రేటు క్రమంగా తగ్గుతోందట. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ తెలంగాణలో గణనీయమైన ధోరణిని సూచిస్తోంది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, తెలంగాణలో ఫర్టిలిటీ రేటు 1.8కి పడిపోయింది. ఇది తెలుగు రాష్ట్రాలు రెండుగా విడపోయినప్పటి నుంచి అంటే 2014 నుంచి గణనీయమైన తగ్గుదలను చూపిస్తోంది. కాగా తగ్గుదలకు హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో జీవనశైలి మార్పులతో పాటు విద్య, ఉపాధి అవకాశాలు పెరగడం కారణంగా చెబుతున్నారు.
మహిళల్లో విద్యాస్థాయి పెరగడం, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి అవగాహన పెరగడం, ఆలస్యంగా వివాహాలు జరగడం వల్ల పిల్లల సంఖ్య తగ్గుతోంది. చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడం. కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు మెరుగుపడటం కూడా కారణమే. రెండు రాష్ట్రాల్లో భారతదేశంలో జనాభా స్థిరీకరణకు అవసరమైన రీప్లేస్‌మెంట్ రేటు 2.1 కాగా, తెలంగాణలో 1.8, ఆంధ్రప్రదేశ్ లో 1.7 కావడంతో.. రెండూ ఈ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి.
దీని వల్ల భవిష్యత్తులో జనాభా వృద్ధాప్యం సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్టిలిటీ రేటు ఇలాగే తగ్గితే యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కార్మిక శక్తి తగ్గడం వల్ల ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. అయితే ఇలాంటి గణాంకాలు దృష్టిలో పెట్టుకునే ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే జనాభాను పెంచాలని చెబుతూ వస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కన్నవారికి ప్రోత్సాహకాలు అందించడానికి రెడీ అవుతున్నారు.