ఇంట్లో ఎంత డబ్బును ఉంచుకోవచ్చో తెలుసా?

Do You Know How Much Money You Can Keep at Home,Do You Know How Much Money,How Much Money You Can Keep,Money you can keep at home,how much money you can keep at home, IT department, Cash at home,Mango News,Mango News Telugu,Income Tax act,Cash Limit at Home,Money you can keep at home in India,Money You Can Keep at Home Latest News,Money You Can Keep at Home Latest Updates,Money You Can Keep at Home Live News,Cash Limit at Home News Today
how much money you can keep at home?, IT department, cash at home,

ఒకప్పుడు బ్యాంకులు తక్కువగా ఉండేవి.. పైగా ఆన్ లైన్ లావాదేవీలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు అరచేతిలో మొబైల్‌తోనే అన్ని కొనేస్తున్నాం, కావాల్సినవాళ్లకు డబ్బులు క్షణాల్లో పంపేస్తున్నాం. అందుకే ఇప్పుడు డబ్బులు ఇంట్లో దాచుకోవడం తగ్గింది. అయినా కూడా చాలామంది వీఐపీలు డబ్బులను వివిధ ప్లేసులలో ఇంట్లోనే దాచుకుంటున్నారు.

కొద్ది మంది మాత్రం ఏ అవసరం ఎప్పుడు వస్తుందోనని.. బ్యాంకుల్లో దాచుకుంటే వాటికి లెక్కలు చెప్పాలని ఇంట్లోనే డబ్బులు దాస్తుంటారు. కాకపోతే ఇంట్లో డబ్బులు ఉంచితే దొంగల బెడద కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలామంది  లాకర్లలో, లేదా వివిధ రకాల పెట్టుబడుల్లోనే తమ డబ్బును పెడుతూ ఉంటారు. అయితే ఇంట్లో డబ్బులు ఉంచుకుంటే పెద్దవాళ్ల ఇళ్లల్లో రైడ్స్ వంటివి  జరగడం వల్ల చాలా మంది తమ ఇళ్లల్లో డబ్బులు ఉంచరు . కానీ ఇలాంటప్పుడు అసలు చట్ట ప్రకారం ఎంత డబ్బును ఇంట్లో దాచుకోవచ్చన్న ప్రశ్నలు తలెత్తుతుంటాయి.

భారతీయ చట్టం ప్రకారం అయినా, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం చూసుకున్నా.. ఇంట్లో ఉంచే నగదుకు ఎలాంటి పరిమితి లేదు. అంటే ఎంత డబ్బు అయినా సరే  ఇంట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసినపుడు ఆ డబ్బు దొరికితే.. యజమాని డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది.. ఎలా వచ్చిందన్న లెక్కలను చెప్పాలి. అంటే కుటుంబ, చట్టపరమైన ఆదాయ వనరులను  లెక్కలతో సహా వివరించాలి. అయితే ఒకవేళ ఇంట్లో ఉంచే డబ్బుకు.. మీ ఆదాయం లెక్కలు సరిపోకపోతే మాత్రం.. ఐటీ శాఖ  జరిమానా విధిస్తుంది. ఐటీ అధికారులకు మీరు  లెక్కల్లో చూపని డబ్బును వాళ్లు స్వాధీనం చేసుకుంటారు. అంతేకాదు..మొత్తం నగదు మొత్తంలో గరిష్టంగా 137 శాతం చలానా విధించే అవకాశాలున్నాయి.

ఎవరైనా వ్యక్తి దగ్గర రూ 20,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు ఉన్నా కూడా ఐటీ శాఖ అడిగితే లెక్కలు చెప్పాల్సిందే.  అంతేకాదు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆ వ్యక్తి  టర్నోవర్ రూ. 20 లక్షల కంటే ఎక్కువ ఉంటే..ఆ  వ్యక్తి నగదు లేదా ఆదాయ మూలాన్ని సమర్పించాలి. అలా సమర్పించలేకపోతే జరిమానా విధించే అవకాశం ఉంది.

అందుకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక వ్యక్తి ఒకేసారి రూ. 50,000 డిపాజిట్ చేసినప్పుడు లేదా విత్‌డ్రా చేసినప్పుడు పాన్ కార్డుతో పాటు సంబంధిత వివరాలను సమర్పించడం తప్పనిసరి చేసింది. అకౌంట్ హోల్డర్స్  ఏడాదిలో రూ.20 లక్షల నగదు డిపాజిట్ చేయాల్సి వస్తే.. అప్పుడు కచ్చితంగా పాన్, ఆధార్ వంటి  వివరాలను బ్యాంకులకు అందించాలి.

రూ. 30 లక్షల కంటే ఎక్కువ నగదు రూపంలో ఒక వ్యక్తి ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకాలు కానీ జరిపితే , ఆ వ్యక్తి గురించి ఐటీ శాఖ ఆరా తీసే అవకాశం ఉంది. అలాగే ఒక కార్డ్ హోల్డర్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ఒకే లావాదేవీలో 1 లక్ష కంటే ఎక్కువ చెల్లించినట్లయితే, ఆ వ్యక్తిని దేనికోసం వాటిని ఖర్చుపెట్టారో అడగటంతో పాటు.. ఆ డబ్బులు ఎలా వచ్చాయన్న ఆధారాలు చూపించమని అడిగే అవకాశం కూడా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =