ఈ టీతో తెల్ల జుట్టు నల్లగా మారుతుందట..

This Tea Turns White Hair Black, Tea Turns White Hair Black, Black Tea Turns White Hair Black, Black Coffee, Black Hair, Black Tea, Mehndi, White Hair, Dandruff, Experts, Hair Loss, Hair Loss Tips, Effects Of Hair Loss, Home Remedies for Dry Hair, Tips For Black Hair, Black Hair Tips, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

బిజీ బిజీ లైఫ్ స్టైల్, మారుతున్న ఆహారపు అలవాట్లు,పెరుగుతున్న కాలుష్యం వల్ల చిన్న వయస్సులోనే చాలా మందికి జుట్టు రాలిపోవటం, తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తెల్లబడిన జుట్టును తిరిగి నల్లగా మార్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. దీనికోసం చాలా మంది డై, హెయిర్ కలర్ వంటివి వాడుతుంటారు. కానీ వాటిలో ఉపయోగించే కెమికల్స్ జుట్టును మరింతగా పాడు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కెమికల్స్ వల్ల జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ అవుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి బ్లాక్ టీ బాగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు

తెల్ల జుట్టును సహాజ పద్ధతిలోనే నల్లగా మార్చడానికి టీ పొడి అద్భుతంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. టీ ఆకులలో టానిక్ యాసిడ్ ఉండటం వల్ల.. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది జుట్టును మృదువుగా, మెరుస్తూ మంచి ఆరోగ్యవంతంగా ఉంచడానికి కూడా దోహదపడుతుంది.

బ్లాక్‌ టీ తయారీ కోసం ముందుగా 2 కప్పుల నీటిలో 4-5 స్పూన్ల టీ పొడి వేసుకుని ఆ నీటిని అర కప్పు అయ్యేవరకూ మరిగించాలి. చిక్కటి డికాక్షన్‌ తయారైన తరువాత దానిని వడకట్టి..చల్లారాక ఆ టీని జుట్టుకు పట్టించి దాదాపు అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత నార్మల్ వాటర్‌తో నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు మూడు నెలల పాటు కంటెన్యూగా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

తెల్ల జుట్టు నల్లగా మారడానికి బ్లాక్ టీ..కాఫీని కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు . దీనికోసం 2 కప్పుల నీళ్లు తీసుకుని అందులో 3 చెంచాల టీ పొడి, 3 చెంచాల కాఫీ పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టుకుని..బ్రష్ సహాయంతో జుట్టుకు అప్లై చేయాలి. సుమారు అరగంట పాటు అలాగే తర్వాత జుట్టును నీటితో కడగాలి.

తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోడానికి, బ్లాక్ టీ, ఓమ గింజలను ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం, 2 గ్లాసుల నీటిలో 2 చెంచాల టీ పొడి, 2 చెంచాల వామ్ము లేదా ఓమ వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చల్లారాక..దానిలో 2 చెంచాల హెన్నా పౌడర్ వేసి బాగా కలపాలి.ఇప్పుడు దీన్ని జుట్టుకు అప్లై చేసి దాదాపు అరగంటసేపు అలాగే ఉంచి..తర్వాత మీ జుట్టును శాంపు వాడకుండా సాధారణ నీళ్లతో కడగాలి.