వీగన్స్ ఎలాంటి నిబంధనలు పాటించాలి?

What Rules Should Vegans Follow,What Rules Should Follow,Rules Vegans Follow,Vegan Diet, Disadvantages of a Vegan Diet,Vegans Diet, Vegans Rules,Mango News,Mango News Telugu,Foods You Can and Cannot Eat,Do All Vegans Follow the Rules,Maintain a Balanced Diet,Balanced Diet for Vegans,Vegetarian and Vegan Eating,Vegans Latest News,Vegans Latest Updates,Vegans Diet Latest Updates
vegan diet, disadvantages of a vegan diet,vegans diet, vegans rules,

ఇప్పుడు ఎక్కడ చూసినా వీగన్స్ పేరు బాగా వినిపిస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా చాలామంది వీగన్స్ గా మారిపోతున్నారు.అంతేకాదు ఈమధ్య వీగన్  డైట్ ను పాటించే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. సోషల్‌ మీడియాలో వీగన్ డైట్ గురించి బాగా ప్రచారం పెరగడం, ఈ కొత్త రకం డైట్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నారు. అంతేకాదు సెలబ్రిటీలు కూడా వీగన్స్ గా మారిపోతుండటంతో చాలామంది ఈ డైట్ పట్ల క్రేజ్ ను పెంచుకుంటున్నారు. వీగన్లు పాల ఉత్పత్తులతో పాటు, తేనె, తోలు, ముత్యాల వంటి వాటికి కూడా దూరంగా ఉంటారు. కేవలం మొక్కల నుంచి దొరికే పదార్థాలను మాత్రమే తీసుకుంటూ ఉంటారు.

ఈ మధ్య చాలామంది జంతువులకు హాని చేయకుండా, శాకాహారాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  వీగన్లుగా మారుతున్నారు. ముఖ్యంగా యువతలో ఎక్కువ మంది ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు. డొనాల్డ్ వాట్సన్  అనే వ్యక్తి..  1944 నవంబర్ నెలలో ది వీగన్ సొసైటీని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచే వీగన్, వీగనిజమ్ అనే పదాలు కూడా  పుట్టాయి. వీగన్  డైట్  గురించి ఇంకా  చెప్పాలంటే పూర్తిగా శాఖాహార పదార్థాలనే తీసుకోవడం. అయితే వీళ్లను వెజిటేరియన్స్ అంటారు కదా అనే అనుమానం రావచ్చు. నిజమే వీళ్లు వెజిటేరియన్స్ కంటే కూడా కొన్ని కఠిన నిబంధనలు పాటిస్తారు. అంటే  శాఖాహారులుగా ఉంటూనే జంతు సంబంధిత ఆహార పదార్థాలయిన పాలు, నెయ్యి, పనీర్ వంటివాటికి పూర్తిగా దూరంగా ఉంటూ, కేవలం వృక్ష సంబంధిత ఆహారాలను మాత్రమే తీసుకుంటారు.

ఇంకా చెప్పాలంటే వీగనిజం పాటించే వాళ్లు చాలా కఠినమైన ఆహార పద్దతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని తీసుకుంటారు. పాలపదార్థాలు , జంతువుల నుంచి వచ్చే ఆహారాలకు బదులు ..పోషక విలువలు తగ్గకుండా ఫుడ్ తీసుకోవడానికి   జాగ్రత్తలు తీసుకుంటారు. పాలకు బదులుగా శనగపలుకుల  నుంచి తీసిన పాలు, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన ఛీజ్, కేక్  వంటివి  తిని పోషకాహార లోపం రాకుండా చూసుకుంటారు.

వీగన్లు కేవలం ఆహారం విషయంలోనే కాదు.. చివరకు  తాము వేసుకునే దుస్తుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా చూసుకుంటారు. అంటే ఉన్ని వస్త్రాలకు దూరంగా ఉంటూ.. కేవలం లెనిన్, కాటన్ తో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. చలిని తట్టుకోవడానికి మనం ధరించే జాకెట్లతో పాటు రెగ్యులర్ గా వాడే బెల్టులు, టోపీలు కూడా వాడరు. ఎందుకంటే వాటి తయారికి లక్షల కొద్ది మూగజీవుల్ని చంపేస్తున్నారన్న కారణంతో వీగన్లు.. వీటిని నిషేధిస్తున్నారు. జంతు చర్మంతో తయారవుతున్న ఉత్పత్తులకు బదులు.. కృత్రిమ నార, సోయా ఉత్పత్తులు, రీసైకిల్డ్‌ నైలాన్‌, కార్డ్‌ బోర్డులతో రూపొందిన దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కినేని అమల, అనుష్క శర్మ, అమీర్ ఖాన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, శ్రద్ధా కపూర్ వంటి సెలబ్రిటీలు కూడా కొన్నేళ్లుగా వీగన్లుగా మారిపోయారు.

ఇలా పూర్తి శాఖాహారులుగా మారడం వల్ల చక్కెర స్థాయిలను మెరుగుపరచడంతో పాటు.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. శాఖాహారాలలో సంతృప్త కొవ్వులు తక్కువగా, ఫైబర్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఫ్యాట్ ‌ కంటెంట్ అసలు ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు  తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా శాఖాహారం తీసుకున్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు బ్యాలెన్స్‌డుగా ఉంటాయి. దీనివల్ల వీరిలో బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

మరోవైపు వీగన్  డైట్ తో చాలా  లాభాలుంటున్నా కూడా  కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీగన్ ఫుడ్ తీసుకునేవారిలో ఐరన్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే  చాలా మంది వీగన్స్  ఐరన్ లోపంతో రక్తహీనతకు గురవుతున్నారు. వీగన్స్‌లో కాల్షియం, విటమిన్‌ B12 పోషకాల లోపంతో పాటు ప్రొటీన్లు తక్కువగా అందే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 1 =