కంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే..

to avoid eye problems, Eye Problem, Avoid glasses, burning eyes, itchy eyes, To avoid eye problems, watery eyes, Eye Health, Health Updates, Live Health Updates, Live News, Breaking News, Headlines, Highlights, Mango News, Mango News Telugu

ప్రస్తుతం చిన్నా లేదు పెద్దా లేదు అందరికీ కంటి సమస్యలు కామన్‌ అయిపోయాయి. సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు తగిలేలా ఉండకపోవడం, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం.. వంటి రకరకాల కారణాల వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయి. ఇక కొందరు పిల్లల్లో జన్యులోపం వల్ల, వంశ పారంపర్యంగా దృష్టి లోపాలు వస్తుంటాయి.

పిల్లలతో పాటు పెద్ద వాళ్లు కూడా రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. వారికి దృష్టి లోపాలు చాలా వరకు పోషకాహార లోపాల వల్లే వస్తాయి. కనుక అన్ని విటమిన్లు, మినరల్స్‌ కలిగిన ఆహారాలను రోజూ ఇవ్వాలి. ముఖ్యంగా దృష్టి లోపాలు రాకుండా ఉండటానికి విటమిన్‌ ఎ ను అందించాల్సి ఉంటుంది. విటమిన్‌ ఎ ఎక్కువగా యాపిల్స్‌, కోడిగుడ్లు, టమాటాలు, నట్స్‌ వంటి ఆహారాల్లో లభిస్తుంది.

రోజూ కొంత సేపు అయినా సరే వెలుతురు లేదా ఎండలో గడిపేలా చూడాలి. ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కువగా ఉపయోగించకుండా చూడాలి. అలా యూజ్‌ చేయాల్సి వస్తే మధ్య మధ్యలో విరామం ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. టీవీలను కూడా ఎక్కువగా చూడనివ్వకూడదు.

చదువులతోపాటు పిల్లలకు ఆటలు, పెద్దవాళ్లకు వ్యాయామం కూడా అవసరమే. శారీరక శ్రమ వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దృష్టి సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక పిల్లలను రోజూ కనీసం గంట సేపు అయినా ఆడుకోనివ్వాలి.ఎక్కువగా కళ్లు నలపడం, కళ్లు ఎర్రగా మారడం, కండ్ల నుంచి తరచూ నీరు రావడం ఇలాంటివి ఏవైనా గమనించినట్టయితే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి.