ఒకే వ్యక్తి పదే పదే మీ కలలోకి ఎందుకు వస్తున్నారు?

Why do Dreams Come,Dreams at Night,dreams come, same person appearing in your dreams,dreams,Why dreams,Mango News,Mango News Telugu,Including processing emotions, consolidating memories,Nightmares and the Brain,Reasons You May Be Having Dreams,Psychology Of Dreams,Do Dreams Affect Sleep,The Science of Dreams,Dreams at Night News Today
Dreams at Night,Why do dreams come?, same person appearing in your dreams?,dreams

చాలామంది కలలు కంటూ ఉంటారు. లేచాక ఆ కల వచ్చింది ఈ కల వచ్చింది అంటూ చెబుతూ.. మంచి కల అయితే హ్యాపీగా  చెబుతారు. అదే చెడు కల అయితే ఇలాంటి కల వచ్చిందేంటి? నిజంగా ఈ కల నిజం అవుతుందంటారా అని టెన్షన్ పడుతుంటారు. కానీ సబ్ కాన్షియస్‌గా మన మైండ్‌లో ఉండిపోయే వ్యక్తులు, ప్రదేశాలు, ఆలోచనలే కలల రూపంలో వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కలలు ఎందుకు వస్తాయన్న ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంటుంది.

మనం పడుకున్నప్పుడు రాత్రి సమయంలోనే ఎక్కువగా కలలు వస్తుంటాయి. ఆ సమయంలో పడుకునే సమయం ఎక్కువగా ఉండటంతో కలలు వస్తుంటాయి. కానీ చాలామందికి తమ కలలు గుర్తుండవు. కొద్దిమందికి మాత్రమే  గుర్తుంటాయి. కొన్ని కలలు అయితే  అర్ధం పర్థం లేకుండా వస్తుంటాయి. ఏది ఏమయినా కలలు ఎందుకు వస్తాయి అనేది మిస్టరీనే. అయితే ఇలా కలలు రావడానికి, సైన్స్‌కు సంబంధం ఉందని పరిశోధకులు అంటున్నారు. రాత్రి పడుకున్న తర్వాత నుంచి ఉదయం లేచేవరకూ వచ్చే కలలులో..పగటిపూట చూసిన దృశ్యాలు, పడుకునే ముందు ఆలోచించే విషయాలే చాలా వరకు రాత్రిళ్లు కలలుగా వస్తాయి.

సైన్స్, సైకాలజీ ప్రకారం చూస్తే.. కలలకు చాలా అర్థాలు ఉన్నాయట. కానీ కలల అర్థం తెలుసుకునే ముందు, అసలు కలలంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యమని అంటున్నారు సైకాలజిస్టులు. జీవితంలో ప్రతి ఒక్కరూ కలలు కంటారని కలలు కనని మనిషే ఉండడని.. ‘ది ఒరాకిల్ ఆఫ్ నైట్’: ‘ది హిస్టరీ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ డ్రీమ్స్’ రచయిత న్యూరో సైంటిస్ట్ ‘సిద్ధార్థ్ రిబీరో’చెబుతున్నారు. సాధారణంగా రాత్రి వచ్చిన కల లేచాక లీలగా గుర్తున్నా.. కాసేపటి తర్వాత చాలా వరకు ఆ కలను మర్చిపోతుంటారు. అలా జరగడానికి కారణాన్ని రచయిత వివరించారు. నిజానికి గాఢ నిద్రలో అంతా దాదాపు మూర్ఛ స్థితిలోనే  ఉంటారు.  అయితే ఈ దశ రాత్రి రెండో భాగంలో జరుగుతుందట. ఈ సమయంలోనే మనిషి  ఎన్నో కలలు కంటుంటాడని వివరిస్తున్నారు.

ఒకవేళ ఎవరి కలలోకి ఎవరైనా పదే పదే ఒకే వ్యక్తి వస్తున్నారంటే దానికి కారణం ఆ పర్సన్ గురించి వాళ్లు ఎక్కువగా ఆలోచించడమే అంటున్నారు పరిశోధకులు. ఆ మనిషి  ఎవరితోనూ ప్రేమలో ఉన్నా  లేదా ఆ వ్యక్తితో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నా కూడా వాళ్లు కలలోకి రావడం జరుగుతుందట.  ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ మనిషికి సంబంధించిన విషయాలు వాళ్ల మనస్సులో నిలిచిపోతాయి. అందుకే ఒకే వ్యక్తి పదే పదే కలలోకి రావడానికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు.

నిజానికి కలలనేవి అపస్మారక, చేతనావస్థ మనస్సు మధ్య వంతెనలా పనిచేస్తాయని రచయిత, పరిశోధకుడు అయిన రిబిరో చెబుతున్నారు.  నిజానికి  మనిషి గాఢ నిద్రలోకి వెళ్లిన రెండో భాగంలో ఒకటిన్నర గంట నిద్రలోనే సుమారు నాలుగు నుంచి ఐదు కలలు వస్తుంటాయి.  నిజానికి మనిషిలోని అచేతనావస్థలోని కోరికలు, భయాల వలనే ఆ మనిషి కలలు ప్రభావితమవుతాయట. అంతేకాదు మనిషి మెదడు రాత్రి నిద్రిస్తున్నప్పుడు..విరామసమయంలో కూడా చురుకుగా ఉంటుంది. దాని వల్లే అందరికీ  కలలు వస్తుంటాయట.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 3 =